ప్రతి నెల ఆ ఇంటికి “త్రివిక్రమ్” 5000 రెంట్ కడుతున్నారు..ఎందుకో తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

సినిమాల్లోకి వచ్చాక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్టామినా ఏంటో మనందరికీ తెలుసు. కానీ రాకముందు ఎలా ఉండేవాడో నటుడు సునీల్‌ మాత్రమే చెప్పగలడు. మెగాస్టార్‌గా మారకముందు చిరంజీవి పడ్డ ఇబ్బందులేంటో సుధాకర్‌కి మాత్రమే తెలుసు. ఎందుకంటే వీళ్లంతా ఒకప్పుడు రూమ్‌మేట్స్‌. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్న ఇంకొందరూ అలా ఒకప్పుడు ఒకే గదిలో ఉంటూ అవకాశాల కోసం కలిసి కష్టపడినవారే…కానీ ఆ తర్వాత ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చాక కూడా వాళ్లున్న రూమ్ తో అనుబంధాన్ని కొనసాగించేది ఎంతమంది..

ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,కమెడియన్ సునీల్..దర్శకుడు దశరథ్ వీళ్లు ముగ్గురు ఒకప్పుడు రూమ్మేట్స్..పంజాగుట్టలోని ఈ రూంలో ఈ ముగ్గురి తమ సినిమా ప్రయాణం గురించి ఎన్నో కలలు కన్నారు..ఆ కలల్ని సాకారం చేసుకున్నారు..మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ దర్శకుడిగా ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారో చెప్పక్కర్లేదు..కమెడియన్ గా ప్రారంభమయిన సునీల్ జీవితం హీరోగా కొనసాగుతుంది..దశరధ్ కూడా మంచి సినిమాల ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందారు ఈ రూం నుండే ప్రారంభమయిన తమ సినిమా ప్రయాణాన్ని ఇప్పటకి కొనసాగిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఇప్పటికీ ఆ రూంకి 5000 రూపాయలు అద్దె చెల్లిస్తూ తన సినిమాలకు కథలను ఇక్కడినుండే రాస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్…అంతేకదా..దర్శకులకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది..త్రివిక్రమ్ విషయంలో ఇది సెంటిమెంట్ అనడం కన్నా తనకు బాగా అలవాటైన చోటు మూలంగా అక్కడే ఎక్కువగా ఆలోచనలు వచ్చి కొత్త కథలు,మాటలు రాయడంలో తోడ్పడతాయి అని చెప్పొచ్చు..

Comments

comments

Share this post

scroll to top