అవును..నా సినిమా మూలకథ అక్కడిదే..క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్.

“అ ఆ”  సినిమాతో హిట్ సాధించిన త్రివిక్రమ్…సోషల్ మీడియాలో కొనసాగుతున్న కాంట్రవర్సి పై వివరణ ఇచ్చాడు. అవును నా సినిమా మూలకథను యద్దనపూడి సులోచన గారి నవల నుండే తీసుకున్నానని, పాత్రల రూపకల్పనలో ఆమెతో 9 నెలల క్రితమే మాట్లాడానని, క్యారెక్టర్స్ మేకింగ్ లో ఆమె సలహాలు కూడా తీసుకున్నానని..అ ఆ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలిపారు. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఆమె పేరును  వేయలేకపోయానని.. ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ పరంగా ఆమె పేరును యాడ్ చేయడానికి 48 గంటల కంటే ఎక్కువ టైమ్ పట్టిందని వివరిస్తూ.. దీని మీద నా వివరణ అయిపోయిందనకుంటున్నాను..ఇంకా వివాదం చేయాలనుకుంటే మీ ఇష్టం అంటూ ఆ మ్యాటర్ ను అంతటితో ముంగించేశారు త్రివిక్రమ్.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top