సోషల్ మీడియాలో రానా త్రిష ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.!! త్రిష తో తనకున్న సంబంధం గురుంచి నోరువిప్పిన రానా..!! ఏమంటున్నాడంటే.?

టాలీవుడ్ లో ప్రభాస్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచేలర్ ఎవరు అంటే అందరూ రానా పేరే చెబుతారు. ప్రభాస్, రానా అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. బాహుబలి తరువాత దేశ వ్యాప్తంగా ఉండే అమ్మాయిలకు వీరిద్దరి మీద ఇష్టం బాగా పెరిగిపోయింది. ఒక్క అనుష్క విషయం తప్పితే ప్రభాస్ పేరు మీద పుకార్లు అంటూ ఏవి లేవు, కానీ రానా విషయం లో ఆలా కాదు. ఒకప్పుడు త్రిష తో, ఇప్పుడు రకుల్ తో ఇంకా చాలా మంది హీరోయిన్ లతో డేటింగ్ లో ఉన్నాడు లవ్ లో ఉన్నాడని పుకార్లు వచ్చాయి. అందులో ఇప్పటికి రానా త్రిష నిజంగానే ప్రేమించుకున్నారా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇదే విషయం అయి కాఫీ విత్ కరణ్ షో లో కరణ్ జోహార్ రానా ని త్రిష ఎఫైర్ గురుంచి అడిగాడు.

త్రిషతో డేటింగ్ చేసావు కదా, పెళ్ళెందుకు చేసుకోలేదు అని రానా ని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు రానా బదులిస్తూ : ” నాకు త్రిష మధ్య లాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంది తప్ప లాంగ్ డేటింగ్ లేదు. ఎక్కువ కాలం ఫ్రెండ్లీగా ఉండడంతో చాలా మంది డేటింగ్ అని భ్రమపడ్డారని, అందులో నిజం లేదని రానా క్లారిటీ ఇచ్చాడు.

మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని కరణ్, రానా ని అడగ్గా. రానా చాలా ఫన్నీ గా సమాధానం చెప్పాడు : ” నా స్నేహితులు చరణ్, బన్నీ పెళ్లి చేసుకొని ఆ తరువాత బిజీ అయిపోయారు, అందుకే నేను సింగిల్ ఫ్రెండ్స్ తో అడ్జస్ట్ అవుతున్నా. పెళ్లయితే భార్యతోనే సమయం గడపాలి, ఫ్రెండ్స్, సింగిల్ స్టేటస్ ఉండదు కాబట్టి అలాంటి లైఫ్ ఎందుకులే,” అని పెళ్లి చేసుకోలేదు అని రానా బదులిచ్చాడు.

 

Comments

comments

Share this post

scroll to top