కేవలం 3 సార్లు.. ఫసక్, భార్య ని విమానాశ్రయం లో వదిలేసి భర్త ఉస్కో.!!

మన్మధుడు సినిమా లో బ్రహ్మానందం పారిస్ లో పోలీస్ లను చూసి ఎలాగైతే పరిగెత్తాడో, బెంగుళూరు విమానాశ్రయం లో భార్య ని వదిలేసి భర్త ఆలా పరిగెత్తాడు, మన్మధుడు సినిమా లో బ్రహ్మానందం పరిగెత్తేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఓసాహో ఓసాహో అని వస్తుంది, కానీ మన డాక్టర్ గారు పరిగెత్తేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ఏం రాలేదు.

వివరాల్లోకెళితే. బెంగుళూరు కి చెందిన డాక్టర్ జావేద్‌ ఖాన్ 2003లో అదే ప్రాంతానికి చెందిన రేష్మా అజీజ్‌ ను పెళ్లి చేసుకున్నాడు. వారికి 10 ఏళ్ళ కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె వున్నారు. కొంత కాలం క్రితం వారు అమెరికా కి వెళ్లి అక్కడే జీవించ సాగరు. ఇటీవల ఇద్దరు భార్యాభర్తల నడుమ పలు అంశాల్లో విభేదాలు తలెత్తాయి. దీంతో పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు ఇల్లినాయిస్ నుంచి బెంగళూరుకు తిరిగివచ్చారు. బెంగుళూరు ఎయిర్పోర్ట్ కి వచ్చిన వెంటనే జావేద్ ఖాన్, భార్య రేష్మ తో నువ్వు వెళ్ళు, నేను వస్తాను ఇంటికి అని చెప్పాడు, తను ఆలా వెళ్ళగానే అమెరికా కు ఫ్లైట్ఎక్కి వెళ్ళిపోయాడు జావేద్ ఖాన్, వాట్స్ అప్ లో భార్య రేష్మ కు తలాక్ తలాక్ తలాక్ అని మెసేజ్ చేసాడు, రేష్మ కు ఏమైందో అర్ధం కాలేదు.

జావేద్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, భార్య రేష్మ పాస్పోర్ట్ కూడా తెలివిగా తన దెగ్గర పెట్టుకొని అమెరికా కి వెళ్ళిపోయాడు జావేద్.
బంధువులతో కలిసి జావేద్ పైన పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చింది రేష్మ. పిల్లోలని ఎక్కడ దాచాడో కూడా తెలీదు అని బాధ పడుతుంది రేష్మ.

ట్రిపుల్ తలాక్ చట్ట రీత్యా నేరం అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒక వేళ అలా ట్రిపుల్ తలాక్ ఇస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మూడు సార్లు మెసేజ్ లో కానీ, రాత పూర్వకంగా కానీ తలాక్ తలాక్ తలాక్ అని అంటే విడాకులు తీసుకున్నట్టు. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. త్రిపుల్ తలాక్ పద్దతి లో విడాకులు తీసుకొనే వారి సంఖ్య మన భారత దేశం లో చాలా తక్కువ.

Comments

comments

Share this post

scroll to top