జ్ఞాప‌క‌శ‌క్తిని అమాంతం పెంచే కొవ్వొత్తి !! చ‌దువుకునే పిల్ల‌ల‌కు చాలా ముఖ్య‌మైన‌ది.!

ఏదైనా ఒక‌ విష‌యం మీద దృష్టి కేంద్రీకృతం అవ్వ‌ట్లేదా? మ‌తిమ‌రుపు పెరిగిపోతుందా? చ‌దివింది గుర్తుండ‌డం లేదా? ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం క్యాండిల్ ట్రిక్.! దీనిని మీ పిల్ల‌ల‌తో రెగ్యుల‌ర్ గా ప్రాక్టీస్ చేయిస్తే…. మీ పిల్ల‌ల మెమొరీలో గుణాత్మ‌క‌మైన మార్పు వ‌స్తుంది. చ‌దువులో కూడా మీ పిల్ల‌లు గ‌తంతో పోల్చితే మెరుగ‌వుతారు.

ఉద‌యం నిద్ర లేవ‌గానే….. ప‌ద్మాస‌నం లో కూర్చొని, కొద్ది దూరంలో స‌రిగ్గా మ‌న కంటికి స‌మాన‌మైన దిశ‌లో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి…. మారుతున్న దాని మంట రంగు, గాలికి క‌దులుతూ త‌న షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు త‌దేకంగా ప‌రిశీలిస్తూ ఉండాలి…అటు త‌ర్వాత… ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి…ఇప్పుడు క‌ళ్లు మూసుకొని ఇంత‌కు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్న‌ట్టు ….మ‌నో నేత్రంతో చూడాలి (ఊహించుకోవాలి).

ఇలా ప్ర‌తిరోజు..చూస్తూ ఉండాలి…. అయితే మొద‌టి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే…క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని త‌గ్గించుకుంటూ పోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తితో పాటు ఊహాశ‌క్తి కూడా అమాంతం పెరుగుతుంది. మీరు ట్రై చేసి మీ అనుభ‌వాన్ని మాతో పంచుకోండి.

Comments

comments

Share this post

scroll to top