2017 లో ఫేస్ బుక్ లో ట్రెండ్ అయిన 17 టాపిక్స్ ఇవే..! మన స్టార్స్ పెర్ఫార్మన్స్ ఓ రివైండ్ వేసుకోండి.!

2017 సంవత్సరం ముగియనుంది..ఇంకొన్ని రోజులు నూతన సంవత్సరానికి వెల్ కం చెప్పబోతున్నాం..ఈ ఇయర్ లో ఆన్లైన్లో ఎక్కువ చక్కర్లు కొట్టిన వారిని,కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఒకసారి గుర్తు చేసుకుందామా..

ఇవాంక హైదరాబాద్ పర్యటన

పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ విజిట్ చేశారు.. ఈ సదస్సుకు ఆమె  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇవాంక రాకతో హైదరాబాద్ కొత్త సొగసులు అద్దుకుంది.ఆమెకు ప్రత్యేక విందు,గొల్లబామ చీర,ప్రధాని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు..ఇవాంక రాక కేవలం హైదరాబాద్ వాసులనే కాదు భారతదేశం మొత్తం ఎదురు చూసింది.రెెండు రోజుల సదస్సు పర్యటనలో ఆమె చివరిగా గోల్కొండను సందర్శించి అమెరికా తిరిగి వెళ్లారు.

బాహుబలి2

బాహుబలి ది కన్ క్లూజన్ అనే చారిత్రక కల్పిత చిత్రాన్ని జక్కన తెరకెక్కించారు.   2015 లో వచ్చిన  బాహుబలి “ది బిగినింగ్”కి కొనసాగింపు గా వచ్చిన  చిత్రం రెండు భాగాలకు గానూ ₹250 కోట్లు ఖర్చు చేసారు. రాబడి 1607కోట్లు. ప్రభాస్,రాణా,రమ్యక్రిష్ణ,సత్యరాజ్,అనుష్క తమ నటనతో ఆకట్టుకున్నారు…బాహుబలి సినిమాతో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటారు రాజమౌలి.

బిగ్ బాస్ 

బిగ్ బాస్ ..మాటివిలో ప్రసారం అయిన ఈ షోని ఎన్టీయార్ హోస్ట్ చేశారు. శివబాలాజి, హరితేజ, ,అర్చన,కత్తిమహేశ్,కత్తి కార్తీక,మధుప్రియ,జ్యోతి,సంపూర్ణెష్ బాబు,ధన్ రాజ్,సమీర్ హౌజ్ మేట్స్ గా ప్రారంభమయిన ఈ షో 72రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది..బిగ్ బాస్ షో విన్నర్ గా శివబాలాజీ నిలిచారు.

మహేశ్ కత్తి- హైపర్ ఆది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తిమహేశ్ కామెంట్స్ చేయగా..పవన్ ఫ్యాన్స్ కత్తి మహేశ్ పై ఎదురుదాడికి దిగారు..ఆ తర్వాత జబర్దస్త్ షోలో హైపర్ ఆది బాడీషేమింగ్ పై కామెంట్స్ చేయడం దానికి మహేశ్ స్పందించడం వరుసగా కొన్ని రోజులపాటు వీరు మీడియాలో నానుతూనే ఉన్నారు.

జిఎస్టీ

ఒకే దేశం,ఒకే పన్ను అనే నినాదంతో దేశంతా ఒకే పన్ను విధానం అమలులో ఉండేలా జిఎస్టీని ప్రారంభించారు.జూలై ఒకటవ తేదిన రాష్ట్రపతి,ప్రధాన మంత్రి దీన్ని ప్రారంభించారు..

జలీల్ ఖాన్

బికాం లో ఫిజిక్స్ చదివానని చెప్పి మనల్ని తెగనవ్వించిన జలీల్ ఖాన్ గుర్తున్నారా..ఇంటర్వ్యూయర్ బికాంలో ఫిజిక్స్ ఉండదు కదా అని అంటే ఉంటది ఉంటది ఎందుకుండదూ అన్న జలీల్ ఖాన్.. ఈ ఇయర్ ఈయనమీద వచ్చినన్ని ట్రోల్స్ ఎవరిపై వచ్చుండవు..

బాలక్రిష్ణ

ఫ్యాన్స్ పై చేయి చేసుకుంటూ బాలక్రిష్ణ ఈ ఇయర్ ట్రోల్స్ లో నిలిచారు..తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన వాళ్ల చెంప పగలకొట్టిన ఈయనతో సెల్ఫీ దిగాలనే ఆలోచన వస్తేనే చెంపకు చెయ్ పెట్టుకునేలా భయపెట్టారు బాలయ్యబాబు.

డైవర్షన్ ఆంటీ

డైవర్షన్ ఆంటీగా పేరుతెచ్చుకున్న యాక్టర్ శ్రీనిజపై కూడా ఈ ఇయర్ చాలానే ట్రోల్స్ వచ్చాయి..రాణా గురించి,పవన్ కళ్యాణ్ గురించి ఈమె చేసిన కామెంట్స్ కి నవ్వుకోనివారుండరు.

మధుప్రియ

బిగ్ బాస్ షోలో కంటెస్టంట్ గా ఉన్న మధుప్రియ ..బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఏడుస్తూ అందరి దృష్టిని ఆకర్శించింది..ఆమె ఏడ్చిన ఏడుపు చూస్తే ఏడుపంటే విరక్తి వస్తుంది..అలా చేసింది.

సామ్,చై

ఈ ఏడాది ఒకటైన జంట సమంతా చైతన్య పెళ్లి కి ముందు నుండి పెళ్లి అయిన చాలా రోజుల వరకు వార్తల్లో ఉన్నారు.అక్టోబర్ 6,7 తేదీల్లో హిందూ,క్రైస్తవ పద్దతుల్లో వీరిద్దరి వివాహం జరిగింది.కేవలం దగ్గుబాటి,అక్కినేని,సమంతా కుటుంబాల మధ్యనే వీరిరువురు ఏకం అయ్యారు.

విహెచ్

అర్జున్ రెడ్డి సినిమా కు సంబందించిన ముద్దు పోస్టర్ ని చించి సోషల్ మీడియాలో నిలిచారు విహెచ్.విహఎచ్ గురించి తాతాయ్య చిల్ అంటూ విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టు బాగా క్లిక్ అయింది.

కిరణ్ కుమార్

ఈ ఇయర్ ఏ హోర్డింగ్ లో చూసిన కనిపించిన ఏకైక వ్యక్తి కిరణ్ కుమార్..లలితా జ్యువెలరీ అధినేత గా కిరణ్ కుమార్ ప్రతి పదినిమిషాలకొకసారి యాడ్లో కనిపించి జనాల్ని భయపెట్టారు.ఈయనపై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు..

గున్న గున్న మామిడి

గున్న గున్న మామిడి…జీడిగింజలో జిల్లాటలో ఈ ఇయర్ మోస్ట్ పాపులర్ సాంగ్ కేటగిరీలో దీన్ని చేర్చొచ్చు.సోషల్ మీడియాలో బాగా వైరలైన ఈ జానపదాన్ని రాజా ది గ్రేట్ సినిమాలో  పెట్టారు..

టివి9

ప్రతి ఇష్యూని కాంట్రవర్సీ చేస్తూ..ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన న్యూస్ ని పక్కన పెడుతూ..కత్తి మహేశ్,హైపర్ ఆది ఇష్యూస్ ని హైలైట్ చేస్తూ టివి9 ఈ ఏడాది వార్తల్లో నిలిచింది.

 

గాలి డాక్టర్

ఫోన్ కాల్ లోనే వైధ్యం చేసి నయం చేసిన డాక్టర్ గా పేరుగాంచిన ఈయన..తన రోగానికి మాత్రం వైధ్యం చేసుకోలేక లైవ్ లో అడ్డంగా దొరికిపోయారు

TEZ APP:

డబ్బులు వస్తే పండగే..కానీ ప్రతిసారి బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే వస్తుంది.!

భానుమతి (సాయి పల్లవి):

భానుమతి ఒక్కటే పీస్..హైబ్రిడ్ పిల్ల.. తెలంగాణ యాసలో సైపల్లవి ఫిదా చేసింది అందరిని.

Comments

comments

Share this post

scroll to top