ట్రైన్ సెల్ఫీ సంఘ‌ట‌న నిజం కాదు.! Original వీడియో విడుద‌ల.!! 2 విష‌యాలు నేర్పిన ఫేక్ న్యూస్.!!!

వేగంగా వ‌స్తున్న ట్రైన్ ముందు సెల్ఫీ తీసుకుంటుండ‌గా…ట్రైన్ ఢీ కొని తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు అని వైర‌ల్ అయిన న్యూస్..అంతా ఫేక్ అంట‌.! అదంతా వీడియో ఎడిటంగ్ అంట‌.!! తాజాగా ట్రైన్ ముందు సెల్ఫీ ఫోజు కొట్టిన కుర్రాడికి సంబంధించిన మ‌రో వీడియో యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.! మా వాడు బాగానే ఉన్నాడు…దుక్క లాగా తింటున్నాడు అని స‌ద‌రు సెల్ఫీ యాక్ట‌ర్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్న మాట‌ల‌ను కూడా మ‌నం ఈ వీడియో లో వినొచ్చు.!! ఇది ఫేక్ అని విన్నాక ఒకింత కోపం వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ సంఘ‌ట‌న‌తో రెండు విష‌యాలు మాత్రం నేర్చుకోవాల్సిన అవ‌స‌రముంది.!

  • 1) సెల్ఫీ మోజులో ప‌డి ప్రాణాలు పోగొట్టుకుంటున్న మ‌న యువ‌త‌కు ఈ వీడియో క‌నువిప్పు.
  • 2) సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వీడియో ను ఆధారంగా చేసుకొని…ఎటువంటి నిజనిజాలు తెలుసుకోకుండా వార్త ప్ర‌చురించిన పెద్ద పెద్ద వార్త ప‌త్రిక‌లు, వెబ్ సైట్స్ ( మాతో స‌హా ) సిగ్గుతో త‌ల దించుకోవాల్సిన సంద‌ర్భమిది.!
  • NOTE.. మా పొర‌పాటును మ‌న్నించండి, మ‌రో సారి ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాం.

Original Video:

Original Video-2:

Comments

comments

Share this post

scroll to top