రన్నింగ్ ట్రైన్ లో నుండి కింద పడిపోయిన 21 ఏళ్ల యువతి..! అసలేమైందో తెలుసా.? చివరికి ఎవరు కాపాడారంటే.?

Krishna

రోడ్డు మీద ఏదన్నా ఘటన జరిగితే మనకెందుకులే అనుకుని పోయేవాళ్లే ఎక్కువమంది..దారిన పోయే వారికి సాయం చేయబోతే మన మెడకు చుట్టుకుంటుందేమో అని ఆలోచించేవారే ఎక్కువ..కాని సాయం చేసి తమ పెద్ద మనసు చాటుకున్నప్పుడే మానవత్వం అనేది ఇంకా బతికుంది అనిపిస్తుంది…అలా ప్రమాదవశాత్తు ట్రెయిన్లోనుండి పడిపోయిన యువతిని రక్షించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది ..ఆ వివరాలు..

భీమవరంలోని శ్రీరామపురానికి చెందిన రాజేశ్వరి వయసు 21సంవత్సరాలు. బీఈడీ చదువుతోంది. పని నిమిత్తం గురువారం విజయవాడకు వచ్చిన ఆమె సాయంత్రం పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో భీమవరానికి తిరుగు ప్రయాణమైంది. రైలు ఆకివీడు గుమ్ములూరు స్టేషన్‌కు సమీపం ప్రయాణిస్తున్నప్పుడు..తలుపు దగ్గరే నిలుచున్న రాజేశ్వరి ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది.అయితే  ట్రాక్‌ పక్కన బురదగుంటలో పడటంతో  ప్రాణానికి ముప్పు రాకపోయినా,తలకు బలైమన గాయం అవడంతో షాక్ కు గురై పైకి లేవలేక బురద గుంటలోనే ఉండిపోయింది.అలా సుమారు 12 గంటలు తెల్లవార్లూ దెబ్బలతోనే ఆ బురదగుంటలో నరకయాతన అనుభవించింది.

మరుసటి రోజు ఉదయం అటుగా వచ్చిన కీ మ్యాన్‌ ఒకరు బురదగుంటలో ఉన్న రాజేశ్వరిని గుర్తించారు. వెంటనే సమీపంలో పనిచేస్తోన్న ట్రాక్‌మన్లను పిలిపించాడు. అందరూ కలిసి యువతిని బయటికి తీసి, బురదను శుభ్రంచేసి, కాసిన్ని నీళ్లు తాగించిన తర్వాత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఇదే వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలవుతుంది. మానవత్వాన్ని చూపించిన సిబ్బంది.. యాక్టింగ్‌ కీ మ్యాన్‌ గోపాల కృష్ణ, ట్రాక్‌ మ్యాన్లు మహేశ్‌, మణికుమార్‌, కనకేశ్వర్‌రావు, ఎం.రాంబాబులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..ఆ వీడియో మీరు కూడా చూడండి.

Comments

comments