టెక్నాలజీ అంటే ఇది….చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది.

ప్రపంచ దేశాలన్నింటిలోనూ పేరు గాంచిన రైల్వే వ్యవస్థ ఆ దేశంలో ఉంది. దీనికి తోడు ఊహకందని సాంకేతిక పరిజ్ఞానం కూడా వారి సొంతం. ఆ రెండు కలిస్తే ఇంకేముంది, అది అద్భుతమే అవుతుంది. అవును, జపాన్‌లో రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల భద్రత దృష్ట్యా చేపడుతున్న చర్యలు నిజంగానే అద్భుతంగా నిలుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి పెద్ద స్థాయిలో కార్యకలాపాలు, రాకపోకలు జరిగే రైల్వే స్టేషన్లు మన దేశంలో లెక్కకు మించి ఉన్నాయి. వీటన్నింటిలోనూ స్టేషన్ స్థాయిని బట్టి ప్లాట్‌ఫాంలు కూడా ఉన్నాయి. అయితే ట్రైన్ వచ్చి ఆగే సమయంలో ప్లాట్‌ఫాం దగ్గరగా నిలబడే ప్రయాణికులకు, రైలు లోంచి దిగే ప్రయాణికులకు మన దగ్గర ఎలాంటి భద్రత చర్యలు లేవు. దీంతో రైలు ఎక్కే క్రమంలో, దిగే క్రమంలో జరిగే సంఘటనల నేపథ్యంలో అనేక మంది ప్రయాణికులు అనుకోకుండా మృత్యువాత పడుతున్నారు.
కానీ జపాన్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఓ వినూత్న ప్రయోగం చేసింది. అదేమిటంటే ప్లాట్‌ఫాం చివర్లకు ఆనుకుని ఉండేలా తలుపుల లాంటి కొన్ని ప్రొటెక్షన్ షీల్డ్‌లను ఏర్పాటు చేసింది. ఇవి ట్రైన్ రాగానే ఆటోమేటిక్‌గా తెరచుకుంటాయి. ట్రైన్ వెళ్లగానే మూసుకుపోతాయి. దీని వల్ల ప్రయాణికులు సేఫ్‌గా రైలు ఎక్కవచ్చు. దిగవచ్చు. జపాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని మన దగ్గర కూడా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది కదూ. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగవు కదా.
జపాన్‌లోని రైల్వే ప్లాట్‌ఫాంల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలకు సంబంధించిన వీడియోను మీరూ వీక్షించవచ్చు…
Watch Video:

Comments

comments

Share this post

scroll to top