ఎక్కడపడితే అక్కడ మూత్రం పోసేయకండలా? పోలీసోళ్ళు చూస్తే ఇదిగో ఇలా సన్మానం చేస్తారు.

ఇచ్చట మూత్రం పోయరాదు అని తాటికాయంత అక్షరాల్లో రాసి ఉన్నప్పటికీ అదే నాకు పర్మీషన్ లెటర్ అని  ఫీల్ అయ్యి అదే గోడపై  జిప్పు తీసి పిచికారి కొడుతుంటారు కొంతమంది. ఓ వైపు స్వఛ్చ్ భారత్ అంటూ చెవుల్లో ప్రతిధ్వనించేట్టు అరుస్తున్నప్పటికీ వీరికి అదేమీ పట్టదు. రోడ్డు మీద చెత్త వేయడం, ఎక్కడపడితే అక్కడ తుప్పుకుమని ఉమ్మడం…ఇంకా కాస్తంత ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు…పక్కనుండి ఎంతమంది పోతున్నా డోంట్ కేర్ తన పని తాను కానిచ్చేస్తుంటాడు..అదేదో మొక్కలకు నీళ్లు పోసినట్టు గోడ మీద మూత్రాన్ని పోసేస్తాడు.

ఇదే పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా నిత్యం జరుగుతుంది. గోడలపై అక్షరాలకు, పోలీసుల బెదిరింపులకు కూడా మన పిచికారీ రాయుళ్లు బెదరలేదు. దీంతో పోలీసులు గాంధీయిజంలో ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్రం పోసే వాళ్ళ దగ్గరికి వెళ్లి వారి చేతిలో గులాబీ పువ్వు పెట్టి, వారి మెడలో ఓ పూలమాల వేసి ఫోటోలు దించుకుంటున్నారు.ఇలాగైనా వీళ్లలో మార్పు వస్తుందేమోనని చూడాలి.

అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. వాస్తవానికి మన నగర ప్రజలకు సరిపడా ఉండాల్సిన సులభ్ కాంప్లెక్స్ లు కానీ ప్రభుత్వం నడిపించే పబ్లిక్ టాయిలెట్స్ కానీ లేవు. వీటి సంఖ్యను గణనీయంగా పెంచితే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. సో ఫస్ట్ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయల మీద ఎక్కువగా దృష్టి పెడితే బాగుంటుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top