Your Life-One Life . అజాగ్రత్త వద్దు, కుటుంబానికి దూరం కావొద్దు.

బయటికి వెళ్లిన వారు ఇంటికి క్షేమంగా చేరతారనే నమ్మకం లేదు. భర్త బయటికి వెళ్ళాక.. వచ్చిన ప్రతి ఫోన్ ను భయంతో లిఫ్ట్ చేసే భార్యలు చాలా మంది ఉన్నారు,  ఏ దుర్వార్త వినాల్సోస్తుందోనని. ఇలా చస్తూ బతకడం, బతుకుతూ చావడం అలవాటైంది మనకు.  దిన దిన గండంగా , దేవుడికి ఓ దండం పెట్టుకొని మరీ  బతుకులు ఈడుస్తున్నాం మనమంతా… రోడ్డు మీదకు వెళ్లాలంటే భయం ఏ వాహనం ఎటు నుండి వచ్చి గుద్దుతుందోనని…

బైక్ పై వెళ్లాలంటే భయం , రాంగ్ రూట్ లో వచ్చి ఎవడు గుద్దుతాడోనని, రోడ్డు మీద నడవాలంటే భయం… ఏ బండి మనమీద నుండి పోతోందోనని..అవునన్నా, కాదన్నా ఇదంతా నిజం. రోజు మన జీవితంలో ఎదురయ్యే ఘటనలే, టివిలలో టైవ్ టెలికాస్ట్ అయ్యే సీన్లే…   తప్పంతా పక్కవాడిదేనా? అనేదే ప్రశ్న. తప్పుఒప్పులు ఎవరివైనా పోయేవి నిండు ప్రాణాలే..  కుటుంబ పెద్ద పోయాక ఆ కుటుంబం పూర్తిగా అనాథే..

ఈ వీడియో చూశాక ఇటువంటి తప్పులు చేయను అని ఫిక్స్ అయ్యే వారు మాత్రమే ఈ వీడియో చూడండి;

(ఈ వీడియో ప్రజాప్రయోజనార్థం కలకత్తా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు వాస్తవ ఘటనలతో రూపొందించారు.)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top