ఉద‌యాన్నే మ‌నం బ్రేక్‌ఫాస్ట్‌గా వండుకునే ఖిచ్‌డీ గురించిన పుట్టు పూర్వోత్త‌రాలు మీకు తెలుసా..?

ఖిచ్‌డీ.. ఈ వంట‌కం గురించి చాలా మందికి తెలుసు. ఉద‌యాన్నే చాలా మంది దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకుంటారు. ఇక కొంద‌రైతే ఉద‌యం, మ‌ధ్యాహ్నం కోసం ఏకంగా ఒకేసారి వండుకుంటారు. దాన్ని ఆఫీస్‌కు లంచ్ బాక్స్‌లో తీసుకెళ్తుంటారు. అయితే ఎవ‌రెప్పుడు తిన్నా, ఎలా తిన్నా ఖిచ్‌డీని మాత్రం దేశంలో అనేక ప్రాంతాల్లో ర‌క ర‌కాలుగా వండుతారు. పప్పులు, పెరుగు, అన్నం వేసి గుజ‌రాత్ వారు వండితే త‌మిళ్ వారు నెయ్యి వేసి వండుతారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వారు అన్నం, శ‌న‌గ‌లు వేస్తారు. క‌ర్ణాట‌క లో బెల్లం, చింత‌పండు కూడా వేసి ఖిచ్‌డీని వండుకుంటారు. ఇలా ఖిచ్‌డీ అనే వంట‌కాన్ని చాలా మంది చాలా ర‌కాలుగా త‌యారు చేస్తారు. అయితే ఎలా వండినా దాని టేస్ట్ అమోఘంగా ఉంటుంది. మ‌రి ఇంత‌కీ.. అస‌లు విష‌యం ఏమిటంటే… ఇన్ని ర‌కాలుగా వండ‌బ‌డే ఖిచ్‌డీని అస‌లు మొద‌ట ఎవ‌రు వండారో, దాని పుట్టు పూర్వోత్త‌రాలు ఏమిటో మీకు తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

khichdi అనే ప‌దం khiccā అనే సంస్కృత ప‌దం నుంచి వచ్చింది. khiccā అంటే బియ్యం, ప‌ప్పులు వేసి వండిన వంట‌కం అని అర్థం వ‌స్తుంది. ఇదే ప‌దం నుంచి ఖిచ్‌డీ పుట్టింది. ఇక దీన్ని మొద‌ట 14వ శ‌తాబ్దంలో వండార‌ట‌. అందుకు చారిత్ర‌క ఆధారాలు కూడా ఉన్నాయి. మొరాకో దేశానికి చెందిన ఇబిన్ బ‌టుటా అనే వ్య‌క్తి భార‌త‌దేశాన్ని 14వ శ‌తాబ్దంలో సంద‌ర్శించాడు. ఇక్క‌డ అనేక ప్రాంతాల్లో అత‌ను ప‌ర్య‌టించాడు. అయితే అత‌ను అప్ప‌ట్లో ఖిచ్‌డీ వంట‌కం రుచిని చూశాడ‌ట‌. అలా అని చెప్పి అత‌ను ఓ పుస్త‌కంలో రాశాడు. ఇంకా అత‌ను అప్ప‌ట్లో ఖిచ్‌డీ గురించి ఏం రాశాడంటే.. బియ్యం, వెన్న‌, ప‌ప్పులు వేసి త‌యారు చేసిన ఓ వంట‌కాన్ని తాను రుచి చూశాన‌ని, అది టేస్ట్ చాలా బాగుంద‌ని రాశాడు. దీన్ని బ‌ట్టి చూస్తే 14వ శ‌తాబ్దంలోనే దీన్ని మ‌న పూర్వీకులు వండిన‌ట్టు తెలుస్తుంది.

అనంత‌ర కాలంలో మొగ‌లులు మ‌న దేశాన్ని ప‌రిపాలించిప్పుడు.. ముఖ్యంగా అక్బ‌ర్ కాలంలో దీన్ని ఆయ‌న వంట‌శాల‌లో వండేవార‌ట‌. బియ్యం, ప‌ప్పుల‌తో చేసిన ఖిచ్‌డీ వంట‌కం అంటే అక్బ‌ర్‌కు చాలా ఇష్టం ఉండేద‌ట‌. దీనికి సంబంధించి ప‌లు పుస్త‌కాల్లో చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక అబు ఫ‌జ‌ల్ అనే వ్య‌క్తి తాను రాసిన Ain-i-Akbari అనే పుస్త‌కంలో ఖిచ్‌డీ గురించిన ప్ర‌స్తావ‌న ఉంది. కుంకుమ పువ్వు, మ‌సాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ వేసి ఖిచ్‌డీ వండిన‌ట్టు ఆయ‌న త‌న పుస్త‌కంలో రాశారు.

అలాగే కేటీ ఆచాయా అనే చరిత్ర‌కారుడు తాను రాసిన ది స్టోరీ ఆఫ్ అవ‌ర్ ఫుడ్ పుస్త‌కంలో ఖిచ్‌డీకి lazeezan అనే పేరు పెట్టాడు. నోరూరించేది అని ఈ ప‌దానికి అర్థం వ‌స్తుంది. ర‌ష్యాకు చెందిన Athanasius Nikitin అనే వ్యాపార వేత్త‌, ఫ్రెంచ్ ప‌ర్యాట‌కుడు Jean-Baptiste Tavernierలు 1600వ సంవ‌త్స‌రంలో భార‌త్‌ను సంద‌ర్శించిన‌ప్పుడు ఖిచ్‌డీ వంటకాన్ని టేస్ట్ చేసి అందుకు ఫిదా అయిపోయార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఔరంగ‌జేబు త‌న కాలంలో ఖిచ్‌డీకి kedgeree అని పేరు పెట్ట‌గా బ్రిటిష్ వారి స‌మ‌యంలో అది పాపుల‌ర్ బ్రేక్‌ఫాస్ట్ అయింది. ఇంగ్లండ్‌లో ఇప్ప‌టికీ వారు ఖిచ్‌డీని వండుకుంటార‌ట‌. ఇలా ఖిచ్‌డీ అనేక వంద‌ల సంవత్స‌రాల నుంచి పాపుల‌ర్ అవుతూ వ‌స్తోంది.

అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఖిచ్‌డీని బియ్యం, మిన‌ప ప‌ప్పు వేసి వండుతారు. ఇక ఇందులో వారు ఉసిరికాయ‌ల‌ను కూడా వేస్తార‌ట‌. కాశ్మీర్‌లో ప‌లు వర్గాల‌కు చెందిన వారు డిసెంబ‌ర్‌లో నిర్వ‌హించే ఓ ఫెస్టివ‌ల్‌లో ఖిచ్‌డీని దేవుడికి నైవేద్యంగా అర్పిస్తార‌ట‌. ఉత్త‌రాఖండ్‌లో అయితే ఖిచ్‌డీని కొత్తిమీర‌, మ‌జ్జిగ బాగా వేసి వండుతారు. వారు నువ్వులు కూడా కొన్ని సార్లు అందులో వేస్తారు. అయితే నిజాం కాలం నుంచి హైద‌రాబాద్ లో ఖిచ్‌డీ బాగా పాపుల‌ర్ అయింది. ఇక్క‌డ ఎక్కువ‌గా బియ్యం, ప‌ప్పులు, మాంసం లేదా కూర‌గాయ‌లు వేసి ఖిచ్‌డీ వండ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఇప్ప‌టికీ ఇదే రెసిపితో చాలా మంది ఖిచ్‌డీని వండుకుంటున్నారు. ఇదీ.. ఖిచ్‌డీ వెనుక ఉన్న క‌థా క‌మామీషు. అయితే పైన చెప్పిన ఖిచ్‌డీ వెరైటీలు చాలా త‌క్కువ‌. ఇంకా మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ర‌కాల్లో ఖిచ్‌డీని వండుకుంటారు. కానీ ఎలా వండినా ఒక్కో ఖిచ్‌డీ రుచి ఒక్కో ర‌కంగా ఉంటుంది. ఏ రుచి అయినా ఓవ‌రాల్ గా చూస్తే ఖిచ్ డీ టేస్ట్ అదుర్సే క‌దా..!

Kahani Khichdi Ki: Tracing the Origins of India’s Fave One-Pot Meal

Comments

comments

Share this post

scroll to top