ఒకప్పుడు నాజూకుగా ఉన్న ఈ 9 మంది హీరోయిన్లు..ఇప్పుడెలా గుర్తుపట్టనట్టు మారిపోయారో తెలుసా?

ఒకప్పుడు హీరోయిన్ అంటే ఎలా ఉండేవారు ముద్దుగా ,బొద్దుగా..కానీ ఇప్పుడు హీరోయిన్ అంటే నడుము నాజుగ్గా ఉండాలి..అసలు ఒంట్లో కెజి కండ ఉందా లేదా అన్నట్టుంటేనే హీరోయిన్ అనే స్థాయిలో వాళ్లూ ఉంటున్నారు.ప్రేక్షకులు తయారయ్యారు.అడపాదడపా సౌందర్య, నిత్యామీనన్,జ్యోతికా,ఛార్మి లాంటి వాళ్లొచ్చినా ..వాళ్లని ప్రేక్షకులు ఆదరించినా జీరోసైజే లో ఉంటేనే హీరోయిన్ అన్నట్టు తయారయ్యారు..

అలా నాజూగ్గా ఉన్న హీరోయిన్లను ఒక్క సారిగా బొద్దుగా చూసేసరికి కొంచెం వింతగానే ఉంటుంది.సినిమాల్లో ఛాన్సుల కోసం కడుపు కట్టుకుని,గంటల తరబడి జిమ్ లలో ఎక్సర్ సైజులు చేసి కష్టపడి తగ్గించిన కొవ్వునంతా..ఛాన్సులు తగ్గిపోయాక అప్పటివరకు కడుపు మాడ్చుకుని తినడం మానేసినవన్ని తినడం వల్లనో, అశ్రద్ద వల్లనో,లేదంటే పెళ్లయి పిల్లలు పుట్టిన కారణం చేతనో బొద్దుగా మారిన హీరోయిన్లు ..అప్పుడు మనం చూసింది వీళ్లనేనా అన్నట్టు తయారయ్యారు..

రొటీన్ వాయిస్ లకన్నా హస్కీ గొంతు తొందరగా ఆకట్టుకుంటుంది.సరిగ్గా అలాంటి వాయిస్,మెస్మరైజ్ చేసే కళ్లతో వచ్చి ప్రేక్షకులను సమ్మోహనపరిచింది మోహిని..ఆదిత్య 369 లో ఆమె నటనకు ఫిదా అవ్వని వారుండరు.తర్వాత మోహన్ బాబు సరసన ఒక సినిమా,చిరంజీవికి చెల్లిగా మరొక సినిమాలో నటించి కనుమరుగైన మోహిని ఈ మధ్య బొద్దుగా తయారయింది

మధ్యాహ్నం హత్యతో తెరంగేట్రం చేసిని హాట్ బ్యూటీ నిషా కొఠారి.తన నాజుకు అందాలని ప్రదర్శించి ప్రేక్షకుల మతి పోగొట్టింది.ఆ మధ్య ఒకమగాడు సినిమాలో బాలక్రిష్ణ సరసన నటించింది.ఇప్పుడు సడన్ గా ఏమైందో లావుగా అయిపోయి దర్శనం ఇచ్చింది.సడన్ గా చూస్తే మనం చూస్తుంది నిషా కొఠారినేనా అనుకుంటాం.

ఇక బొద్దుగా అనే మాటకి మించి తయారయ్యారు శరణ్య,రక్షిత… ఏయ్ సుచీ అని పిలవగానే వెనక్కి తిరిగి చూసి తన చూపుతోనే కుర్రకారు మతి పోగిట్టిన  సుచిత్ర క్యారెక్టర్లో ఒదిగిపోయిన రక్షితను..ఇప్పుడు చూస్తే మాత్రం నీరుగారిపోవడం ఖాయం.శరణ్య మోహన్ భీమిలిలో నాని సరసన నటించి అందరి అభిమానం పొందింది..కానీ ఏమైందో తన మొదటి సినిమా హీరో కృష్ణున్ని ఆదర్శంగా తీసుకుందేమో..చాలా లావెక్కిపోయింది.

వీళ్లే కాదు నమిత,దివ్యవాణి,రాశి,రోజా ,అనుష్క,రవళి అందరూ ఒకప్పుడు నాజూకుగా ఉండేవారు.కానీ ఒక్కసారిగా బరువెక్కి వీళ్లకేమైంది అన్నట్టు అందర్ని ఆశ్చర్యపరిచారు.వీరిలో దివ్యవాణి మళ్లీ ఇదివరకటిలా తయారయింది.రాశి ప్రయత్నాలు ఫలించి మొత్తం కాకపోయినా కొంచెం బరువు తగ్గింది.సైజ్ జీరో కోసం పెంచిన శరీరం బరువు ని బాహుబలికోసం తగ్గించుకోలేకపోయింది అనుష్క..నమిత,రవళి,రోజాలు మాత్రం అదే బరువుతో కంటిన్యూ అవుతున్నారు..

రాధా, వాణిశ్రీ గారు కూడా అలాగే మారిపోయారు..

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top