హాల్ టికెట్ మీద‌…. ఆమ్మాయి ఫోటోకు బ‌దులు, హీరోయిన్ టాప్ లెస్ ఫోటో.!

ఫిబ్ర‌వ‌రి 29 న జ‌ర‌గాల్సిన బీహార్ ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్ టికెట్స్ జారీ అయ్యాయి. అందులో ఓ అమ్మాయి హాల్ టికెట్ మీద‌..ఉండాల్సిన ఆమె ఫోటోకు బ‌దులు..ఓ హీరోయిన్ టాప్ లెస్ ఫోటో ప్రింట్ అయ్యి ఉంది. ఇది చూసి షాక్ అయిన అమ్మాయి…ఫ్రిన్సిప‌ల్ కు ఈ విష‌యం తెలియ‌జేసింది. దీంతో ఈ విష‌యం ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.దేవుడి పేరు మీద ఆధార్ కార్డ్ జారీ చేసిన ఉదంతాలు… మ‌న ఊరి ఓట‌ర్ లిస్ట్ లో స‌చిన్ టెండూల్క‌ర్ పేరును పొంద‌ప‌రిచిన సంద‌ర్భాలు…..కోకొల్ల‌లు. కానీ హాల్ టికెట్ మీద హాట్ ఫోటో రావ‌డం మాత్రం ఇదే ఫ‌స్ట్ టైమ్. ఈ ఘ‌ట‌న బీహార్ లోని న‌లంద జిల్లాలో జ‌రిగింది.

గ‌తంలో కూడా బీహార్ SSC బోర్డ్ కు ఘ‌న‌మైన చ‌రిత్రే ఉంది, అస‌లు వాళ్లు చ‌దివే కోర్సులో ఏ ఏ స‌బ్జెక్ట్స్ కూడా ఉంటాయో తెలియ‌ని వారిని స్టేట్ ర్యాంక‌ర్లు గా ప్ర‌క‌టించి, త‌ర్వాత వాళ్ల అస‌లు స‌బ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని నాలుక్క‌రుచుకుంది. తాజాగా…మ‌రోమారు ఇలాంటి పొర‌పాటు చేసి వార్త‌ల్లోకెక్కింది బీహార్ SSC బోర్డ్. స‌ద‌రు అమ్మాయి పేరు, ఆ హీరోయిన్ పేరు ఒక‌టేకావ‌డంతో …. ఫోటో అప్ లోడింగ్ లో జ‌రిగిన పొర‌పాటు ఇది..ఎంత ప‌ని ఒత్తిడి ఉంటే మాత్రం…ఏ ఫోటో అప్ లోడ్ చేస్తున్నారో చూసుకోక‌పోతే ఎలా.? అయినా…అస‌లు ఆ సిస్ట‌మ్ లోకి ఈ ఫోటో ఎందుకు వ‌చ్చింది ? అంటే సిబ్బంది వాళ్లు చేయాల్సిన ప‌నుల‌ను ప‌క్క‌కు పెట్టి..వేరే ప‌నుల‌తో కాల‌క్షేపం చేస్తున్నార‌ని చెప్ప‌క‌నే చెబుతుంది ఈ ఘ‌ట‌న‌.

Comments

comments

Share this post

scroll to top