యాపిల్ సంస్థ నిర్వ‌హించే ఇంట‌ర్వ్యూల్లో అడిగే అత్యంత క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌లు ఇవే తెలుసా..?

సాప్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ గురించి తెలుసు క‌దా. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మాక్ బుక్ వంటి ఎన్నో ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ఆయా రంగాల్లో తారా ప‌థంలో దూసుకెళ్తోంది. అయితే ఏంటి అంటారా..? ఏమీ లేదండీ.. గూగుల్ లాగే యాపిల్ కూడా ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థే. అందులో ప‌నిచేయాల‌ని చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు క‌ల‌లు కంటారు. అయితే ఆ క‌ల‌లను కొంద‌రు మాత్ర‌మే సాకారం చేసుకుంటారు. ఈ క్ర‌మంలో వారు ప‌రీక్ష‌లు రాసి, ఇంట‌ర్వ్యూల‌కు అటెండ్ అయి, ఎన్నో రౌండ్ల‌లో క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొంటారు. వాటికి జ‌వాబులు చెబితేనే జాబ్ వ‌స్తుంది. లేదంటే రాదు. మరి యాపిల్ సంస్థ నిర్వ‌హించే జాబ్ ఇంట‌ర్వ్యూల‌లో అభ్య‌ర్థుల‌ను అడిగే టాప్ ప్ర‌శ్న‌లు ఏవో తెలుసా..? వాటినే కింద చూడండి..!

1. నీ ద‌గ్గ‌ర రెండు కోడిగుడ్లు ఉన్నాయ‌నుకుందాం. వాటిలో దేన్న‌యినా ఒక‌దాన్ని ఎత్త‌యిన భ‌వనం నుంచి కింద‌కు విస‌రాలి. అయితే అది ప‌గ‌ల‌కూడ‌దు. అలా ప‌గ‌ల‌కూడ‌దు అంటే దాన్ని ఏ ఫ్లోర్ నుంచి విస‌రాల్సి ఉంటుంది..? అస‌లు అది ఎలా సాధ్య‌మ‌వుతుంది..? వివ‌రించండి..!

2. మీ జీవితంలో మీకు ఎదురైన క‌ఠిన స‌మ‌స్య‌ను మీరు ఎలా ప‌రిష్క‌రించారో చెప్పండి.

3. 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న బాలుడికి మోడెమ్ లేదా రూట‌ర్ ఎలా ప‌నిచేస్తుందో వివ‌రించండి.

4. రోజుకు ఎంత మంది పిల్ల‌లు పుడుతున్నారు..?

5. ఒక టేబుల్‌పై 100 కాయిన్లు ఉన్నాయి. వాటిలో 10 కాయిన్లకు బొమ్మ పైవైపుకు ఉంటుంది. మిగిలిన 90 కాయిన్ల‌కు బొమ్మ కింది వైపునకు ఉంటుంది. అయితే వాటిని చూడ‌కుండా రెండు గ్రూపులుగా విడ‌దీసి రెండు గ్రూపుల్లోనూ బొమ్మ పై వైపుకు ఉండే కాయిన్లను స‌మానంగా పెట్ట‌గ‌ల‌వా..?

6. మేం నిన్ను ప‌నిలో పెట్టుకుంటే నువ్వే ప‌ని చేస్తావు..?

7. ఒక బాక్స్‌లో యాపిల్స్ ఉన్నాయి. ఒక బాక్స్‌లో ఆరెంజ్‌లు ఉన్నాయి. మూడ‌వ బాక్స్‌లో ఈ రెండు పళ్లూ ఉన్నాయి. అయితే వాటి లేబుల్స్ మాత్రం క‌రెక్ట్‌గా లేవు. ఏ బాక్స్‌లో ఏది ఉందో అవి క‌రెక్ట్‌గా తెలియ‌జేయ‌వు. అలాంటి మూడు బాక్స్‌ల‌లో ఒక బాక్స్‌ను చూడ‌కుండా తెరిచి అందులో ఉన్న పండును మాత్ర‌మే చూసి మిగిలిన రెండు బాక్స్‌ల‌లో ఏ పండ్లు ఉన్నాయో చెబుతావా..?

8. ఒక పెన్ను త‌యారీకి అయ్యే పూర్తి ఖ‌ర్చును వివ‌రించు.

9. ఒక మ‌నిషి త‌న వ‌ద్ద ఉన్న పాత కంప్యూట‌ర్ పాడైంద‌ని అంటాడు, అది అవ‌స‌రం అని చెబుతాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు..?

10. నువ్వు చాలా తెలివిగ‌ల స్మార్ట్ ఎంప్లాయ్‌వేనా..?

11. నువ్వు ఇప్ప‌టి వ‌ర‌కు ఏయే అంశాల్లో ఫెయిల్ అయ్యావు. వాటి నుంచి ఏం నేర్చుకున్నావు..?

12. నువ్వెప్పుడైనా నీ ఉన్న‌తాధికారి నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించావా..? అలా చేస్తే ఎందుకు అలా చేశావో ఉదాహ‌ర‌ణ‌ల‌తో చెప్పు..!

13. బాగా ఊగుతున్న ఓ టేబుల్‌పై నీరు ఉన్న ఒక గ్లాస్ పెట్టారు. అప్పుడు గ్లాస్ ముందు కింద‌కు ప‌డుతుందా, అందులో ఉన్న నీరు ముందు కింద ప‌డుతుందా..?

14. నీ జీవితంలో నువ్వు గ‌ర్వప‌డే విధంగా చేసిన ప‌ని ఏదైనా ఉందా..? ఉంటే అది ఏంటి..?

15. మేం నీకు ఎందుకు జాబ్ ఇవ్వాలి..?

16. అంద‌రిలో కెల్లా సృజ‌నాత్మ‌కంగా ఆలోచించ‌గ‌ల‌వా..? అలా ఆలోచిస్తే దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌గ‌ల‌వా..?

17. నీ జీవితంలో జరిగిన అత్యంత జాలి ప‌డిన ఘ‌ట‌న ఏదైనా ఉంటే చెప్పు.

18. వినియోగ‌దారుడి స‌మ‌స్య‌ను ప‌రిష్కరించ‌డం ముఖ్య‌మా లేక వినియోగ‌దారునికి మంచి రెస్పాన్స్ ఇవ్వ‌డం ముఖ్య‌మా..?

19. యాపిల్ సంస్థ త‌న Apple Computers Incorporated పేరును Apple Inc గా ఎందుకు మార్చిందో తెలుసా..?

20. నువ్వు వేటి వ‌ల్ల ఇక్క‌డిదాకా వ‌చ్చావు..?

21. ఐట్యూన్స్‌ను పోలిన యాప్ ఒక‌టుంది అనుకుందాం. అందులో ఇమేజ్‌లు అన్నీ వ‌రుస పెట్టి వ‌స్తుంటాయి. అయితే చూసిన ఇమేజ్‌ల‌ను మ‌ళ్లీ చూడ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి..?

22. ఒక జార్‌లో స‌రిగ్గా ముద్రిత‌మైన‌, ముద్రితం కాని కాయిన్స్ క‌లిసిపోయి ఉన్నాయ‌నుకుందాం. వాటిలో ఒక కాయిన్‌ను ఎంపిక చేసుకుని మూడు సార్లు తీసి చూస్తే వ‌రుస‌గా బొమ్మ‌, బొరుసు వ‌స్తున్నాయ‌నుకుందాం. అప్పుడు నువ్వు తీసిన ఆ మూడు కాయిన్లు స‌రిగ్గా ముద్రితం అయినవో, కానివో చెప్ప‌గ‌ల‌వా..?

23. గ‌డిచిన నాలుగేళ్ల‌లో మీకు బాగా మంచిగా అనిపించిన రోజు, చెడుగా అనిపించిన రోజు ఉన్నాయా..? ఉంటే అవేంటి..?

24. ఏదైనా యాపిల్ స్టోర్‌లోకి నువ్వు ఒక క‌స్ట‌మ‌ర్‌గా వెళ్లిన‌ప్పుడు ముందు నువ్వు ఎలా ఫీల‌వుతావు..? ఏం ఆలోచిస్తావు..?

25. యాపిల్‌లో నువ్వు ఇప్పుడు చేరితే ప్ర‌స్తుతం చేస్తున్న కంపెనీలో నువ్వు ఏం మిస్ అవుతావు..?

26. నీ ఫేవ‌రెట్ యాప్‌ని నువ్వు ఎలా టెస్ట్ చేస్తావు..?

27. రానున్న 5 ఏళ్ల‌లో నీకు ఏమేం కావాల‌ని అనుకుంటున్నావు..?

28. ఒక బ్రెడ్ టోస్ట‌ర్‌ను నువ్వు ఏ విధంగా టెస్ట్ చేస్తావు..?

Comments

comments

Share this post

scroll to top