మహానటి సినిమాలో మనసుకు హత్తుకున్న 20 డైలాగ్స్ ఇవే.!

మహానటి మానియా ఇప్పట్లో వదిలేలా లేదు.. ఆమె ఒక నటి అనుకున్నవారికి ఆమె ఒక మహోన్నత శిఖరం అని పరిచయం చేసిన సినిమా..ఆమెది అందరిలాంటి కథే ..సినిమా వాళ్ల కథ అనుకున్న వారికి ఆమెది కథ కాదు చరిత్ర అని పరిచయం చేసిన సినిమా మహానటి..నిజంగా ఆమె కథని కాదు కాదు చరిత్రని అందరికి తెలియచేసిన నాగ్ అశ్విన్ ని ఎంత ప్రశంసించినా తక్కువే.. ఇక సాక్షాత్తూ సావిత్రే తిరిగొచ్చిందా అన్నట్టుగా నటించిన కీర్తికి అర్జంటుగా దిష్టి తీసేయాలి..సావిత్రి గారిని మన కళ్లముందు నిలిపిన కీర్తి నిజంగా  ఈ తరం మహానటి..సినిమాకు సంభందించిన ప్రతి ఒక్కరు వారి పనిని వారు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా చేశారు.అందులో ఒకరు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా…

అతని మాటల గురించి చెప్పుకునే ముందు అతని గురించి చెప్పుకుందాం…సాయి మాధవ్ బుర్రా ప్రముఖ రంగస్థల నటులు, రచయిత మరియు సినిమా సంభాషణల రచయిత.క్రిష్ దర్శకత్వంలో వచ్చిన క్రిష్ణం వందే జగద్ఘురం  సినిమాతో సినీ సంభాషణల రచయితగా పరిచయమయ్యాడు.సాయిమాధవ్‌, ప్రముఖ రంగస్థల నటులైన బుర్రా సుభ్రహ్మణ్య శాస్త్రి కుమారుడు.  తెనాలిలో 1973 డిసెంబర్ 15న జన్మించారు. ఈయన తల్లి కూడా రంగస్థల నటే. తల్లిదండ్రులిద్దరు రంగస్థల కళాకారులు అవడం, కళాకారుల కుటుంబంలో జన్మించడం సాయికి కలిసొచ్చింది. ఆరు సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర నాటకంలో లోహితాశ్యుడు పాత్ర ధరించారు. హైస్కూల్ చదువులో స్కూల్ నాటకాల్లో నటించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. మయసభ దుర్యోధన ఏకపాత్రాభినయంలో మంచి పేరు సంపాదించారు.తన మిత్రులతో కలిసి అభ్యుదయ కళాసాహితి అనే సంస్థను స్థాపించి, కళ్లు నాటికను ప్రదర్శించారు.

సాయిమాధవ్ కృష్ణం వందే జగద్గురుమ్‌తో మాటల రచయితగా పరిచయమైన ఆయన గోపాలా,గోపాలా,కంచె,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,సోగ్గాడే చిన్ని నాయనా,గౌతమీ పుత్రశాతకర్ణి తదితర విజయవంతమైన చిత్రాలకి పనిచేశారు..తన గత సినిమాల్లోని డైలాగుల పదును గురించి మనకు తెలియనిది కాదు..ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా గుర్తుండిపోయేలా మాటల్ని మనసుకి తాకేలా రాస్తారు..ఉదా.మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమానే.. మహానటి సినిమాలో సాయి మాధవ్ బుర్రా కలం నుండి వచ్చిన కొన్ని ఆణిముత్యాలు..

 • నాకు సావిత్రి తెలియదు.. సావిత్రిగారు మాత్రమే తెలుసు
 •  పెద్దవాళ్లని గౌరవించాలి, సావిత్రిగారి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళు కూడా గౌరవించాలి
 • వ్యక్తిత్వం గురించి రాయాలంటే అర్హత కావాలి
 •  కథ ప్రేమలాంటిది, మనకి కావాల్సినప్పుడు దొరకదు, దానికి కావాల్సినప్పుడే వెతుక్కుంటూ వస్తుంది.
 • మాటలకు భాష కావాలి, మనసుకి కాదు.

 •  జీవితంలో నటించొచ్చు కానీ, జీవితాన్ని నటించకూడదు.
 •  ప్రతిభ ఇంటిపట్టునుంటే.. ప్రపంచానికి పుట్టగతులుండవు
 • నీకు సినిమాలు అవసరమైనప్పుడు సినిమా నీ అవసరాన్ని తీర్చిందిగా.. ఇప్పుడు సినిమాకి నువ్వు అవసరం.
 •  నువ్వు నా వెనకుండి ఆటపట్టిస్తున్నావునుకున్నాను.. కానీ ముందుండి మాయాబజార్ నే నడిపిస్తున్నావ్.
 •  ఆడాళ్ళ ఏడుపు అందరికీ తెలుస్తుంది, మగాళ్ల ఏడుపు మందు బాటిల్ కు మాత్రమే తెలుస్తుంది.

 • శరీరంలో మార్పు వచ్చిందంటే.. జీవితంలో కూడా ఏదో మార్పు వస్తుందని అర్ధం.
 • నేను మరీ అంత మహానటిని కాదులెండి.. కెమెరా లేకపోతే బొత్తిగా నటించడం రాదు.
 • అందరూ దాన్ని అలవాటు, వ్యసనం అనుకుంటారు.. కానీ అదొక జబ్బు.
 • ఇది కలికాలం.. వడ్డించిన చేతికున్న ఉంగరాళ్ళు లాక్కెళ్లే రకాలమ్మా ఇప్పుడున్న వాళ్ళు.
 • ఆవిడ కథలో కన్నీళ్ళునాయి.. కానీ వాటిని తుడుచుకుని లేచే ధైర్యం కూడా ఉంది.
 • ప్రేమించినవాడి కోసం అందర్నీ వదులుకున్నాను. ప్రేమ కోసం ప్రేమించినవాడ్ని కూడా వదులుకున్నాను.

 • ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకడమే అదృష్టం.
 • ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి.
 • జీవితం చాలా చిన్నది, ఈ కాసేపు మనం మనలాగే ఉండాలి.
 •  చివరికి మిగిలేదేమిటి.. మనం పంచిన ప్రేమ, మనం చేసుకున్న జ్ణాపకాలు.

Comments

comments

Share this post

scroll to top