త‌ర‌చూ త‌ల‌స్నానం చేస్తే వెంట్రుక‌లు బాగా రాలిపోతాయా..? ఇలాంటి అపోహ‌ల్లో నిజం ఎంత‌.. తెలుసా..?

వెంట్రుక‌ల‌ను సంరక్షించుకోవ‌డంలో మ‌హిళ‌లే కాదు, పురుషులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. వారు కూడా త‌మ శిరోజాల సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే మ‌హిళ‌లు, పురుషుల‌కు త‌ల‌పై ఉండే వెంట్రుక‌లు కానీ, పురుషుల‌కు గ‌డ్డంపై ఉండే వెంట్రుక‌లు కానీ వాటిని సంర‌క్షించుకునేట‌ప్పుడు, వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకునేట‌ప్పుడు అనేక సందేహాలు వారికి వ‌స్తుంటాయి. ఓ ద‌శ‌లో కొన్ని సందేహాల‌ను, అపోహ‌ల‌ను నిజ‌మ‌ని న‌మ్ముతారు కూడా. మ‌రి వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ విష‌యంలో అస‌లు చాలా మందికి ఉండే అపోహ‌లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. త‌ర‌చూ త‌లంటు స్నానం చేస్తే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది ?
చాలా మంది అనుకుంటారు. త‌ర‌చూ త‌లంటు స్నానం చేస్తే బ‌ట్ట‌త‌ల వ‌స్తుందేమోన‌ని లేదా వెంట్రుక‌లు బాగా ఊడిపోతాయ‌ని అనుకుంటారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. నిజానికి త‌లంటు స్నానం వ‌ల్ల శిరోజాల‌పై పాజిటివ్‌గా లేదా నెగెటివ్ గా ఎలాంటి ఎఫెక్ట్ ప‌డ‌ద‌ట‌. దాంతో న‌ష్టం ఉండ‌దు, అలాగ‌ని లాభ‌మూ ఉండ‌దు. కాక‌పోతే త‌ల శుభ్ర‌మ‌వుతుంది, అంతే..!

2. వెంట్రుక‌ల‌ను క‌ట్ చేసినా, షేవ్ చేసినా అవి త్వ‌ర‌గా, ద‌ట్టంగా పెరుగుతాయి ?
కొంద‌రు వెంట్రుక‌ల‌ను క‌త్తిరించినా, వాటిని షేవ్ చేసినా అవి బాగా పెరుగుతాయ‌ని నమ్ముతారు. కానీ అందులో నిజం లేదు. వాస్త‌వంగా చెప్పాలంటే వెంట్రుక‌ల‌ను క‌త్తిరించిన‌ప్పుడు లేదా షేవ్ చేసిన‌ప్పుడు కొన్ని రోజుల వ‌ర‌కు ద‌ట్టంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. కానీ అవి మొద‌ళ్లు క‌నుక అలాగే ఉంటాయి. త‌రువాత కొద్ది రోజుల‌కు వెంట్రుక‌లు ఎలాగూ పెరుగుతాయి క‌నుక అవి ద‌ట్టంగా అనిపించ‌వు. మామూలుగానే ఉంటాయి.

3. మెడిసిన్ వాడితే వెంట్రుక‌లు ద‌ట్టంగా పెరుగుతాయి ?
ఇది వ‌ట్టి పుకారు మాత్ర‌మే. నిజానికి వెంట్రుక‌లను పెంచే మందులేవీ లేవు.

4. రోజుకు 40 నుంచి 100 వెంట్రుక‌లు రాలిపోవ‌డం మామూలే ?
అలా అని రూలేం లేదు. కొంద‌రికి ఈ సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చు. కొంద‌రికి ఈ సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌వ‌చ్చు. బ‌ట్ట‌త‌ల వ‌చ్చే వారిలో స‌హ‌జంగా ఎక్కువ వెంట్రుక‌లు ఊడిపోతాయి. అలా కాకుండా వెంట్రుక‌లు ఊడిపోతుంటే స‌రైన పోష‌ణ లేద‌ని తెలుసుకోవాలి. శిరోజాల‌ను సంర‌క్షించుకుంటే చాలు, వెంట్రుక‌లు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

5. డ్రైయింగ్ చేస్తే వెంట్రుక‌లు రాలిపోతాయి ?
అవును, ఇది మాత్రం నిజ‌మే. హెయిర్‌డ్రైయ‌ర్ వాడితే దాన్నుంచి వ‌చ్చే గాలికి వెంట్రుక‌లు ఊడిపోతాయి. అయితే అది సాధార‌ణ‌మే. అవి మ‌ళ్లీ పెరుగుతాయి. కానీ దాని వ‌ల్ల నిరంత‌రాయంగా వెంట్రుక‌లు రాల‌డం అనేది ఉండ‌దు.

6. హెయిర్ క‌ల‌ర్స్ వాడితే వెంట్రుక‌లు రాలిపోతాయి ?
ఇందులో నిజం లేదు. హెయిర్ క‌లర్స్ వాడినా, అందుకోసం శిరోజాల‌కు బ్లీచింగ్ వంటివి చేసినా వెంట్రుక‌లు చిట్లుతాయి త‌ప్ప రాల‌వు. రాలినా అది తాత్కాలిక‌మే. నిరంత‌రాయంగా ఉండ‌దు.

7. హెయిర్ లాస్ అరిక‌డితే వృద్ధాప్యం త్వ‌ర‌గా రాదు ?
ఇందులో కూడా నిజం లేదు. ఎవ‌రైనా వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ వృద్ధాప్యంలోకి వెళ్తారు. అది స‌హ‌జ‌మే. కానీ వెంట్రుక‌లు రాల‌డాన్ని అరిక‌డితే వృద్ధాప్యం త్వ‌ర‌గా రాదు, అని మాత్రం అనుకోకూడ‌దు. అందులో నిజం లేదు. వృధ్ధాప్యం ఎవ‌రికైనా రావాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top