దేశంలో ఆదాయపరంగా టాప్-5 దేవాలయాలు ఏమో మీకు తెలుసా?

ఆ ఆలయాల ఆదాయం చూస్తే దిమ్మతిరుగుతుంది, విరాళాలు, కానుకల రూపంలో వచ్చిన సొమ్మును లెక్కలేసుకోవడానికే ఆ ఆలయ సిబ్బందికి రెండు చేతలు పని చేయాల్సిన పరిస్థితి  . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేశంలోనే అధిక ఆదాయం పొందుతున్న 5 దేవాలయాల పేర్లు ఇలా ఉన్నాయి. అవి పద్మనాభస్వామి దేవాలయం ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, దీని తర్వాత మన తిరుపతి రెండవ స్థానంలో ఉంది. తర్వాత షిర్డీ సాయిబాబా దేవాలయం, దాని తర్వాత వరుసగా వినాయక టెంపుల్, గోల్డెన్ టెంపులు ఉన్నాయ్.

1. పద్మనాభస్వామి దేవాలయం:
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో కొలువై ఉన్న దేవాలయం పద్మనాభస్వామి దేవాలయం. అత్యధిక ఖర్చుతో నిర్మించబడిన దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి.ఈ ఆలయంలో మొత్తం ఆరు చాంబర్ గదులుండగా, అందులో రెండు చాంబర్ గదులు కేవలం భక్తులిచ్చే కానుకలకు ఉపయోగిస్తున్నారట. బంగారం, డబ్బు రూపంలో వచ్చే కానుకలు అధికం.
2
2. తిరుమల వేంకటేశ్వరుడు:
ఏడు కొండలవాడా.. వేంకటేశ అంటూ భక్తులు స్మరిస్తూ ఆ ఏడుకొండల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. ఒక్క రోజులోనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు 60,000 మందికి పైగా దర్శించుకుంటారని అంచనా. ఇందులో సామాన్యులతో పాటు వివిఐపీలు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన సినీ సెలెబ్రిటీస్ విలువైన కానుకలు, డబ్బు కొన్ని కోట్లలో ఉంటుందని..అంత్యంత ధనిక దేవాలయాలలో రెండవ స్థానంలో తిరుమల దేవాలయం ఉందని చెబుతున్నారు.
925003681s
3. షిర్డీ సాయిబాబా దేవాలయం:
మతాలకతీతంగా భక్తులచే సేవలందుకుంటూ భక్తులు కోరికలు తీరుస్తూ, గొప్ప ధనిక దేవాలయాలలో ఒకటిగా ఉన్న దేవాలయం షిర్డీ సాయి బాబా దేవాలయం. ఈ దేవాలయానికి భక్తులు సమర్పించే బంగారు, సిల్వర్ ఆభరణాల ధర కొన్ని కోట్లలో ఉంటుందట. నిత్యం భక్తులతో కళకళలాడే షిర్డీ సాయి టెంపుల్ మూడవ స్థానంలో ఉంది.
4
 
4. సిద్ధివినాయక గుడి:
ఎటువంటి ఇబ్బందులు  కలగకుండా కాపాడే దేవుడుగా భక్తులచే పూజింపబడుతున్నాడు ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో ఉన్న వినాయకుడు. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉండే ఈ ఆలయం గోపురం 3.7 కిలోల బంగారంతో నిర్మితమైంది. ఇది ఒక భక్తుడు విరాళం ఇచ్చినట్లు అక్కడి ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ఆలయం అత్యధిక ధనిక ఆలయంలో నాలుగవ దేవాలయంగా నిలిచింది.
5
5. గోల్డెన్ టెంపుల్:
పంజాబ్ లోని అమృత్ సర్ లో సిక్కుల యాత్రిక స్థలంగా గుర్తింపుపొందిన దేవాలయం గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయాన్ని బంగారు, సిల్వర్ కోటింగ్ లతో నిర్మించారు. దేశంలోని భక్తుల నుండి విరాళాలు, కానుకల ద్వారా, ఆ ఆలయం టాప్ 5 లో నిలిచింది.
6

Comments

comments

Share this post

scroll to top