హనీమూన్..! వివాహం అయిన తరువాత జంటలు ఒక్కటయ్యే ఓ మధురమైన కలయిక..! ప్రతి జంటకు హనీమూన్ జీవితాంతం గుర్తుంటుంది. ఎన్నో మధురమైన అనుభూతులను పంచుతుంది. దంపతులిద్దరూ శారీరకంగానే కాదు, మానసికంగా ఒక్కటయ్యేందుకు లభించే గొప్ప అవకాశం అది. అయితే అలాంటి హనీమూన్ జరుపుకునేందుకు చక్కని ప్రకృతి అందాలు కలబోసిన ప్రదేశాలు అయితేనే బెటర్. అప్పుడే ఆయా ప్రాంతాల్లో విహరిస్తూ, అందాలను ఆస్వాదిస్తూ హనీమూన్ మజాను ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ క్రమంలో హనీమూన్ కోసమైతే ఎక్కడో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంచక్కా మన దేశంలోనే హనీమూన్ ను ఎంజాయ్ చేసేటువంటి కొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. షిమ్లా…
ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో షిమ్లా అందాలు అద్భుతంగా ఉంటాయి. ఈ నెలల్లో షిమ్లాను చాలా మంది పర్యాటకులు విజిట్ చేస్తారు. హనీమూన్ కు వెళ్లే వారికి కూడా ఇప్పుడే చాలా బాగుంటుంది. దీంతో పాటు సెప్టెంబర్ 3వ వారం నుంచి అక్టోబర్, నవంబర్ 2వ వారం వరకు కూడా షిమ్లాలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు కూడా షిమ్లా వెళ్లవచ్చు.
2. మనాలి…
జూన్, జూలై, ఆగస్టు నెలలు తప్ప సంవత్సరంలో మిగిలిన ఏ నెలలో అయినా మనాలిని సందర్శించవచ్చు. హనీమూన్‌కు వెళ్లే జంటలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు.
3. కేరళ…
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో కేరళను సందర్శించవచ్చు. అక్కడి బోటు షికారు, సీఫుడ్, ఇతర ప్రకృతి అందాలను హనీమూన్ జంటలకు బాగుంటాయి.
4. కాశ్మీర్…
ఏడాది పొడవునా ఏ నెలలో అయినా కాశ్మీర్‌కు వెళ్లవచ్చు. చల్లని హిమానీ నదులు, మంచు కొండలు, ప్రకృతి అందాలు హనీమూన్ జంటలను ఆకట్టుకుంటాయి.
5. శ్రీనగర్…
శ్రీనగర్‌కు కూడా ఏడాది పొడవునా ఏ నెలలో అయినా వెళ్లవచ్చు. కానీ చలి కాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్లకు చేరుకుంటాయి. అవి తట్టుకోగలమంటే ఆ కాలంలోనూ హనీమూన్ జంటలు అక్కడికి వెళ్లవచ్చు.
6. సిక్కిం…
అక్టోబర్ నుంచి మే నెలల మధ్యలో సిక్కింను సందర్శించాలి. ఇక్కడి తోటలు, పూల వనాలు, కొండ చరియలు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. హనీమూన్ జంటలకైతే మధురానుభూతులను పంచుతాయి.
7. డార్జిలింగ్…
మార్చి 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు డార్జిలింగ్ అందాలను వీక్షించవచ్చు. హనీమూన్ జంటలకు కూడా డార్జిలింగ్ అనువైన ప్రదేశం.
8. జైపూర్…
రాజస్థాన్‌లోని జైపూర్ కు వెళ్లాలంటే అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్యలో వెళ్లాలి. ఎండాకాలంలో వెళితే అక్కడి ఎండలకు తట్టుకోలేరు.
9. అండమాన్ దీవులు…
అక్టోబర్ నుంచి మే నెలల మధ్యలో అండమాన్ దీవులను వీక్షించవచ్చు. సముద్రపు అందాలు, సుందరమైన బీచ్ లు, ప్రకృతి సోయగాలతో అండమాన్ దీవులు అలరారుతూ ఉంటాయి. హనీమూన్ జంటలకు చక్కని వేదిక.
10. హంపి…
కర్ణాటక రాష్ట్రంలోని హంపి కూడా హనీమూన్ జంటలకు బాగుంటుంది. అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్యలో హంపి వెళ్లవచ్చు.
11. మున్నార్…
కేరళలో ఉండే మున్నార్ కూడా హనీమూన్ జంటలకు అనువుగా ఉండే ప్రదేశం. ఇక్కడి పచ్చని కొండచరియలు జంటలకు ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయి. ఆగస్టు నుంచి మే నెలల మధ్య కాలంలో ఇక్కడికి వెళ్లవచ్చు.
12. గోవా…
సాధారణ పర్యాటకులకే కాదు, గోవా హనీమూన్ జంటలకు కూడా బాగుంటుంది. ఇక్కడి బీచ్‌లు, సముద్రపు అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. నవంబర్ నుంచి మార్చి నెలల మధ్య కాలంలో ఇక్కడికి వెళ్లవచ్చు.
13. పాండిచ్చేరి…
దీనినే పుదుచ్చేరి అని కూడా పిలుస్తారు. ఏడాది పొడవునా ఏ నెలలో అయినా ఇక్కడికి వెళ్లవచ్చు. అంతటి ప్రకృతి అందాలను ఈ ప్రాంతం కలిగి ఉంటుంది.
14. కూర్గ్…
కర్ణాటకలో ఈ ప్రాంతం ఉంది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలంలో ఇక్కడికి వెళితే అందాలను బాగా ఎంజాయ్ చేయవచ్చు.
15. ముస్సోరి…
ఉత్తరాఖండ్‌లో ముస్సోరి ఉంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ ప్రాంతం పర్యాటకులకు అనువుగా ఉంటుంది.
16. లదాఖ్…
మే నుంచి నవంబర్ నెలల మధ్యలో ఎప్పుడైనా లదాఖ్‌కు వెళ్లవచ్చు. హనీమూన్ జంటలకు లదాఖ్ చక్కని ప్రకృతి అందాలను అందిస్తోంది. వాటిని చూసి దంపతులు ఎంజాయ్ చేయవచ్చు.
17. లోనవాలా…
మహారాష్ట్రలో ఈ ప్రాంతం ఉంది. ఏడాదిలో ఏ నెలలో అయినా ఇక్కడికి హనీమూన్ దంపతులు వెళ్లి రావచ్చు. చాలా అనువుగా ఉంటుంది.
18. నైనిటాల్…
ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సెప్టెంబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు నైనిటాల్ అందాలను వీక్షించేందుకు అనువుగా ఉంటుంది. పచ్చని ప్రకృతి అందాలు హనీమూన్ జంటలను అలరిస్తాయి.
19. ఊటీ…
ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఊటీ అందాలను ఆస్వాదించేందుకు అనువుగా ఉంటాయి.
20. లక్షద్వీప్…
సెప్టెంబర్ నుంచి మే నెల మధ్య వరకు లక్షద్వీప్‌ను సందర్శించవచ్చు. ఆహ్లాదకరమైన ద్వీపాలు, ఉత్తేజాన్ని అందించే బీచ్‌లు ఇక్కడ ఫేమస్. హనీమూన్ జంటలకు అవి ఎన్నో మధురానుభూతులను ఇస్తాయి.