నేటి టాప్-10 న్యూస్ (04-05-2017)

# పాక్ రాక్షసకాండపై భారత్ ఆగ్రహం
కశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద పాకిస్థాన్ ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి ఇద్దరు జవాన్లను హతమార్చడమేగాక, వారి తలలు నరికిన ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్, ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. తమ సైనికులను అతిక్రూరంగా హతమార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు సమన్లు జారీ చేశారు.

# విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
ఘన చరిత్ర కలిగిన విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా దక్కింది. ఆంధ్రప్రదేశ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న విధంగా బెజవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది.

# ఈఫిల్‌ టవర్‌కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌
భారత రైల్వే ‍వ్యవస్థ మరో సంచనానికి సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఓభారీ వంతెన నిర్మాణానికి ప్రణాలికలు వేస్తోంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇది. సుమారు 1.3 కిలోమీటర్ల పొడవుతో జమ్మూలోని కాట్ర, శ్రీనగర్‌లోని కౌరీ ప్రాంతాలను కలుపుతూ భారత రైల్వే ఈ వంతెన నిర్మించనుంది.

# భారత్‌లోకి 770 బిలియన్‌ డాలర్ల నల్లధనం
భారత్‌లో నానాటికీ పెరిగిపోతున్న నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలు చేపట్టారు. అయితే 2005 నుంచి 2014 మధ్య భారత్‌లోకి దాదాపు 770 బిలియన్‌ డాలర్ల నల్లధనం వచ్చిందట.

# మార్కెట్లోకి సచిన్ ఫోన్లు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్ (ఎస్‌ఆర్‌టీ) పేరుతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సచిన్ టెండూల్కర్ వెనకుండి నడిపిస్తున్న హైదరాబాద్ కేంద్రస్థానంగా సేవలు అందిస్తున్న స్మార్ట్న్.ఎస్‌ఆర్‌టీ పేరుతో ప్రత్యేక స్మార్ట్‌ఫోన్లను నేడు ఆవిష్కరించింది.

# బంగినపల్లి మామిడికి భౌగోళిక గుర్తింపు
70 శాతానికి పైగా పంట దిగుబడితో అగ్రస్థానంలో ఉన్న బంగినపల్లి (బెనీషా) మామిడి పండుకు చెన్నై భౌగోళిక సూచనల రిజిస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన పంటల అభివృద్ధి సంస్థకు భౌగోళిక గుర్తింపు ధ్రువపత్రాన్ని జారీ చేసింది.

# ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న అక్షయ్ కుమార్
రాష్ట్రపతి భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఉత్తమ నటుడిగా రుస్తుంకు సినిమాకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు.

# విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు ప్రదానం
ప్రత్యేకమైన కళాదృష్టితో, వినూత్న రీతిలో ప్రేక్షకులకు చిత్రరాజాలనందించిన కళాతపస్వి కే విశ్వనాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు.

# మరో రెండు భాషల్లోకి బాహుబలి-2
కేవలం భారత్‌ లోనే కాదు అమెరికా, సహా ఇతర దేశాల్లో కొత్త చర్రిత లిఖిస్తోంది బాహుబలి-2. ఈ మూవీని మరో రెండు భాషల్లోకి డబ్బింగ్‌ చేసి రెండు దేశాల ప్రేక్షకులకు ఈ విజువల్‌ వండర్‌ ను చేరువ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top