నేటి టాప్-10 న్యూస్ (28-04-2017)

# జేఈఈ మెయిన్స్‌లో వీర్వాల్ రికార్డు
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన కల్పిత్ వీర్వాల్ అనే విద్యార్థి సత్తా చాటాడు. సీబీఎస్ఈ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్-2017 ఫలితాల్లో వీర్వాల్ కల్పిత్ 360కు 360 మార్కులు తెచ్చుకుని ఆలిండియా మొదటి ర్యాంక్‌ను సాధించి, అరుదైన రికార్డు సృష్టించారు.

# 9000 మంది పోలీసుల తొలగింపు
ఏకంగా తొమ్మిది వేల మంది పోలీసులను టర్కీ ప్రభుత్వం తొలగించింది. గతేడాది జూన్‌లో టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదుర్ఘటనకు ప్రధానకారకుడు వ్యాపార వేత్త గులెన్ అని టర్కీ ప్రభుత్వం నిర్ధారించింది. గులెన్‌తో సంబంధాలు ఉన్న 9000 మంది పోలీసులను గుర్తించి వారిని విధులనుంచి తొలగించింది.

# భలే చౌక విమానయానం
విమానయాన రంగం అభివృద్ధికి భారత్‌ చొదక శక్తిగా మారనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ వైమానిక అనుసంధానతను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రాధాన్యతను గుర్తించే తాము ‘ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌’ (ఉడాన్‌) పథకాన్ని తీసుకువచ్చినట్టు మోడీ తెలిపారు.

 

# మేడం టుసాడ్స్‌లో కపిల్‌ విగ్రహం
లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో కపిల్‌ మైనపు ప్రతిని చేర్చనున్నారు. దాంతో, ఇప్పటికే ఆ మ్యూజియంలో ప్రతిమలు ఉన్న ఇతర క్రికెట్‌ దిగ్గజాల సరసన కపిల్‌ చేరనున్నాడు

# అత్యంత ఆకర్షణీయ బ్రాండ్‌ గూగుల్‌ ఇండియా
దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన కంపెనీ బ్రాండ్‌గా గూగుల్‌ ఇండియా నిలిచింది. మెర్సిడెజ్‌-బెంజ్‌ రెండో స్థానంలో నిలిచిందని ‘రాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ 2017’ సర్వే తెలిపింది.

# కశ్మీరులో సైనిక శిబిరంపై ఉగ్ర దాడి
కశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని సైనిక శిబిరంపై భారీ ఆయుధాలతో ఉగ్రమూక విరుచుకుపడి ముగ్గురు సైనికులను పొట్టనబెట్టుకుంది. దాదాపు 35 నిమిషాల పాటు సైనికులు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి.

# మాంసం వల్ల గొడవ వరుడినే మార్చేసింది
పెళ్లి విందులో మాంసాహారం లేదని గొడవకు దిగిన వరుడితో తెగతెంపులు చేసుకుందో వధువు. అయితే అంతలోనే అనూహ్యంగా పెళ్లికి వచ్చిన అతిథి వధువును పెళ్లాడతానని ముందుకొచ్చాడు. ఆమె కూడా సరేననడంతో ఘనంగా పెళ్లి జరిగింది.

# కియా మోటార్స్‌ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
దక్షిణ కొరియా దిగ్గజ కార్ల సంస్థ అయిన కియా మోటార్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కియా కార్ల తయారీ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

# సీఎంగా పళనిసామి కొనసాగింపు
అన్నాడీఎంకే విలీన చర్చల అంశాల్ని రహస్యంగా ఉంచేందుకు పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు నిర్ణయించాయి. ఈ విషయంలో కమిటీలకు నేతృత్వం వహించే నాయకులు తప్ప ఇతరులు ఎవ్వరూ నోరు మెదపకూడదని తమ శిబిరాల్లోని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.

Comments

comments

Share this post

scroll to top