నేటి టాప్-10 న్యూస్ (27-04-2017)

# నేడు జెఇఇ మెయిన్‌ ఫలితాలు
శంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందేం దుకు నిర్వహించిన జెఇఇ మెయిన్‌ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి.

# ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జయభేరీ మోగించింది. ప‌దేళ్లుగా ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో పాగా వేసిన ఆ పార్టీ.. ఈసారి కూడా పాగా వేసింది. ఢిల్లీలోని మూడు నగర పాలక సంస్థల్లోనూ బీజేపీ హవా సృష్టించింది. మొత్తం 270 వార్డులకు గానూ బీజేపీ 183 స్థానాల్లో విజయం సాధించింది.

# కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా
ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు అజయ్ మాకెన్ ప్రకటించారు. నేటి నుంచి ఏడాది పాటు కేవలం పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.

# బాహుబలి-2 యూనిట్ కు దుబాయ్ లో ఘోర అవమానం
బాహుబలి-2 యూనిట్ తమ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఇటీవలే దుబాయిలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల కోసం యూనిట్ వెళ్ళింది. ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి ఇండియాకు రావడానికి ఎమిరేట్స్ ఫ్లైట్‌లో సిద్ధమైన యూనిట్ కు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది నుంచి ఘోర అవమానం ఎదురైంది. ఈ విషయాన్ని సినిమా ప్రొడ్యూస్ శోబు యార్లగడ్డ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

# గుజరాత్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శిగా అశోక్‌ గెహ్లాట్‌
గుజరాత్‌ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శిగా రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ నియమితులయ్యారు. గుజరాత్‌కు ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గెహ్లాట్‌ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

# భజ్జీ ట్వీట్‌ వల్ల పైలట్‌ తొలగింపు
ఇంటర్నెట్‌డెస్క్‌:జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌ బెర్నాండ్‌ హోయిస్లిన్‌ ఓ మహిళతో పాటు, దివ్యాంగుడైన వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించడాని భారత క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా వ్యాఖ్యానించిన నేపథ్యంలో సదరు పైలట్‌పైసంబంధిత విమానయాన సంస్థ చర్యలు తీసుకుంది.

# సైనా పాత్రలో శ్రద్ధాకపూర్‌
క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది. ప్రపంచ అగ్రశ్రేణి షట్లర్‌ సైనా జీవిత చరిత్రలో శ్రద్ధాకపూర్‌ టైటిల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా శ్రద్ధాకపూర్‌ వెల్లడించారు.

# 30,000 దాటిన సెన్సెక్స్‌ !!
ఇప్పుడు సెన్సెక్స్‌ 30 ఏళ్ల(వేల) జవ్వని. ఈ స్థాయికి చేరడం అంత సులువుగా ఏం జరగలేదు. రెండేళ్ల కిందట కూడా ఇంట్రా డేలో 30,000 పాయింట్లను అధిగమించినా.. ముగింపు అదే స్థాయిలో పలకలేదు. రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తాజాగా బుధవారం బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ కొత్త రికార్డులను సృష్టించింది.

# అమెరికా క్రికెట్‌ జట్టులో హైదరాబాదీ
హైదరాబాద్‌ రంజీ జట్టు మాజీ వికెట్‌ కీపర్‌ ఇబ్రహీమ్‌ ఖలీల్‌ అమెరికా వన్డే క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించాడు. ఉగాండాలో వచ్చే నెలలో జరిగే ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌–3లో పాల్గొనే అమెరికా జట్టులో ఖలీల్‌ ఎంపికయ్యాడు.

# రూ.300 కోట్లతో ఐటీ కారిడార్‌ అభివృద్ధి
మహానగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, వాహనాలు, ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా.. భవి ష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు.

Comments

comments

Share this post

scroll to top