నేటి టాప్-10 వార్తలు ( 26-4-2017 )

#1. టి.టి.వి. దినకరన్‌ ను అరెస్టు చేసిన పోలీసులు
ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే పార్టీ అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

#2. మే 15 నుండి సాయంత్రం 6 దాటితే నో పెట్రోల్‌
మే 15వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇవి పనిచేస్తాయి. ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్వహణ వ్యయం పెరిగిపోతుండటంతో 24 గంటలూ బంకులు నడపడం కష్టంగా మారిందని, దీంతో రోజుకు కేవలం 12 గంటలు మాత్రమే నడపాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ రావి గోపాలకృష్ణ ప్రకటించారు.

#3. భారీగా ఆయుధ ప్రదర్శన చేసిన ఉత్తర కొరియా
అవసరమైతే అమెరికా యుద్ధ నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించిన ఉత్తర కొరియా.. తమ వద్ద ఏయే ఆయుధాలు ఉన్నాయో చూసుకోవాలంటూ ఓ భారీ ప్రదర్శన నిర్వహించింది. తమ సైన్యం ఏర్పడి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర కొరియా ఈ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది.

#4. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం 500 టికెట్లు బుక్ చేసిన కలెక్టర్
బాహుబలి 2 సినిమా చూసేందుకు చివరికి ఐఏఎస్‌‌లు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మొత్తం 500 టికెట్లు కొనుగోలు చేయడం హాట్ టాపికగా మారింది.

#5. 16 ఏళ్ల తర్వాత అవార్డు ఫంక్షన్ కి హాజరు అయినా అమీర్ ఖాన్
16 సంవత్సరాలుగా అమీర్ ఖాన్ ఏ అవార్డు ఫంక్షన్ కు హాజరు కావడం లేదు. ఇన్నాళ్లు అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉంటూ వచ్చిన అమీర్ ఖాన్. ఈ సారి 75వ దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. దీంతో మీడియా ఫోకస్ అంతా ఒక్కసారిగా అమీర్ ఖాన్ వైపు మళ్లింది.

#6. ధోని కోసం ప్యాంట్ అమ్ముత అంటున్న షారుక్ !!
ఐపీఎల్‌ వేలంలో ధోని అందుబాటులో ఉంటే అతన్ని కొనుగోలు చేసేందుకు తన పైజామాను కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ కింగ్, కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్‌ వ్యాఖ్యానించాడు.

#7. బాహుబలి 2 టికెట్ రేటు రూ.2400
ఢిల్లీలోని PVR: Director’s Cut అనే థియేటర్లో ప్లాటినమ్ సుపీరియ్ క్లాస్ టికెట్ రూ. 2400 రేటుకు అమ్ముతున్నారు. బాహుబలి టికెట్ మాత్రమే ఇంత ఎక్కువ రేటుకు అమ్మతున్నారు. ఇక్కడ సినిమాకు ఉన్న డిమాండును బట్టే టికెట్ రేటు ఉంటుందని తెలుస్తోంది.

#8. ఇకపై ఐటి కొలువులు కష్టమే
అమెరికా, ఆస్ట్రేలియా పరిణామాలు ఐటి నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వచ్చే ఆరు నెలల కాలంలో ఐటి సంస్థల్లో నియమాకాలకు కష్టకాలమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్రెగ్జిట్‌, హెచ్‌-1బి వీసా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ వంటి అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వేచి, చూసే దోరణీని అవలంభి స్తున్నాయి.

#9. రోహిత్‌కు భారీ జరిమానా
అంపైర్‌ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా వాగ్వాదానికి దిగిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రోహిత్‌కు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా పడింది.

#10. ముస్లిం పేర్లపై బ్యాన్ విధించిన చైనా
కొన్ని ముస్లింల పేర్లను చిన్నారులకు పెట్టడంపై చైనా బ్యాన్ విధించింది. ఇస్లాం, ఖురాన్, మక్కా, జిహాద్, ఇమామ్, సద్దాం, హజ్, మదీనా వంటి పేర్లు ముస్లిం చిన్నారులకు పెట్టడాన్ని నిషేధించింది. అలాంటి పేర్లున్న పిల్లలకు వసతి, విద్యా సౌకర్యాలు అందవని హెచ్చరించింది.

Comments

comments

Share this post

scroll to top