నేటి టాప్-10 వార్తలు (25-4-2017)

#1. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు
ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్‌కు 2016వ సంవత్సరానికిగాను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందిస్తోంది.

#2. శతాబ్ది ఉత్సవాలకు ఓయూ ముస్తాబు
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు శరవేగంగా ముస్తాబవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరుగుతున్న వందేళ్ల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

#3. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపి రికార్డు నెలకొల్పిన మహిళా వ్యోమగామి పెగ్గీవిట్సన్
అంతరిక్షంలో అత్యధిక రోజులపాటు (534 రోజులకుపైగా) గడిపిన వ్యక్తిగా అమెరికా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డు అమెరికాకే చెందిన వ్యోమగామి జెఫ్‌విలియమ్స్ పేరిట ఉంది.

#4. 530 అడుగుల ఏపీ శాసనసభ భవనం !!
ఆధునిక నిర్మాణ శైలి, శాస్త్రీయ దృక్కోణం, ప్రజారాజధాని భావనల మేలు కలయికగా రాజధానిలో దిగ్గజ భవనంగా నిర్మించే శాసనసభ ఆకృతుల్ని బ్రిటన్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఒక ఆకృతి రూపొందించిన ఆ సంస్థ, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు మరో రెండు ఆకృతులు రూపొందిస్తోంది.

#5. త్వరలో పోస్టాఫీసుల్లో ఏటీఎం సేవలు
దేశవ్యాప్తంగా పోస్టాఫీసులన్నీ మినీ ఏటీఎంలుగా ప్రజలు సేవలందించనున్నాయని తపాలాశాఖ కార్యదర్శి బీవీ సుధాకర్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన సేవలన్నీ పోస్టాఫీసుల నుంచి పొందవచ్చని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధాన కార్యాలయాలతో వీటిని అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.

#6. బాలీవుడ్ నటితో జహీర్ ఖాన్ నిశ్చితార్థం
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి సాగరిక ఘాట్గెతో జహీర్‌ నిశ్చితార్థం సోమవారం జరిగింది.

#7. 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను చంపిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు బరితెగించారు. తమ కంచుకోటలో మాటువేసి మెరుపుదాడి చేసి మరీ 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను అతిదారుణంగా చంపేశారు. దక్షిణ బస్తర్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఈ ఘటన జరిగింది.

#8. పతంజలికి మరో షాక్‌ !
పతంజలి బ్రాండ్‌ నేమ్‌ మరోసారి చిక్కుల్లో పడింది. పతంజలి పాపులర్‌ బ్రాండ్‌ ఆమ్లా జ్యూస్‌పై కోలకతా ల్యాబ్‌ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో భారతదేశం డిఫెన్స్‌ రంగానికి చెందిన రిటైలింగ్ వేదికల్లో పతంజలి అమ్లా జ్యూస్ అమ్మకాలను నిలిపివేసింది.

#9. బాహుబలి-2 ఆరు షోలు రద్దు చేయాలంటూ డిమాండ్!
బాహుబ‌లి-2 సినిమా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రోజుకి ఆరు షోలకు అనుమతి ఇవ్వ‌డం వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని సినీ ప్రేక్షకుల సంఘం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

#10. ఆవుల‌కు ఆధార్ నంబర్
దేశంలో పెరిగిపోతున్న ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు ప్రతి గోవుకు ఆధార్ నంబర్ తరహాలో ఒక ప్ర‌త్యేక నంబ‌రును కేటాయించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇలా చేయ‌డం ద్వారా గోవుల‌ను సంరక్షించుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.

Comments

comments

Share this post

scroll to top