నేటి టాప్-10 న్యూస్ (25-05-2017)

# ట్విట్టర్ నుండి అవుట్ అయినా సింగర్ సోను నిగమ్
ముస్లింలు పాటించే ‘అజాన్’ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఇక ఆ వివాదం తరువాత, ఆయన పై ట్విట్టర్ లో అనుకూల-వ్యతిరేఖ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రావడం మొదలయ్యింది. అయితే వీటన్నిటి ప్రభావమో ఏమో తెలియదు కాని, ఆయన ఈ రోజు ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేస్తునట్టు ప్రకటించడం అందరికి షాక్ కలిగింది.

# లియోనెల్ మెస్సీకి జైలు శిక్ష, జరిమానా
అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ మోసపూరితంగానే పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని స్పెయిన్‌ సుప్రీం కోర్టు విచారణలో తేల్చింది. దీంతో మెస్సీ, అతని తండ్రి జార్జ్‌ హరసియో మెస్సీపై రూ. 14.57 కోట్ల (2.25 మిలియన్‌ డాలర్లు) జరిమానా, 21 నెలల జైలు శిక్ష విధించింది.

# సైనికాధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు
యుద్ధరంగం తరహా నేపథ్యంలో సైనికాధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు రక్షణమంత్రి అరుణ్ జైట్లీ.

# 32% భారతీయులు థైరాయిడ్‌ బాధితులే
ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ప్రస్తుతం థైరాయిడ్‌ లోపంతో బాధపడుతున్నారని తాజా సర్వే ఒకటి తెలిపింది. 2014–16 కాలంలో దేశవ్యాప్తంగా 33 లక్షల మందిపై ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ ఈ సర్వేను నిర్వహించింది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 32 శాతం థైరాయిడ్‌ లోపంతో బాధపడుతున్నట్లు సదరు సంస్థ సర్వేలో తేల్చింది.

# ‘మగధీర’ను కాపీ కొట్టారంటూ.. బాలీవుడ్ సినిమా పై కేసు పెట్టిన అల్లు అరవింద్!
హిందీతో తెరకెక్కుతున్న ‘రబ్తా’ సినిమాపై ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ కేసు వేసారు. ఈ సినిమా తాను నిర్మించిన ‘మగధీర’ చిత్రాన్ని కాపీ కొట్టి తీసారని, వెంటనే సినిమా విడుదల నిలిపివేయాలని అల్లు అరవింద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

# జహీర్‌-సాగరిక ఎంగేజ్‌మెంట్‌
మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన.. తన గాళ్‌ఫ్రెండ్‌, బాలీవుడ్‌ నటి సాగరికా ఘట్గెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గతంలోనే ఈ ప్రేమ జంట రింగ్‌లు మార్చుకున్నా.. మంగళవారం రాత్రి ముంబైలో అతిథుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

# ‘కిమ్’ ఓ పిచ్చోడు : ట్రంప్
ఉత్తరకొరియా దగ్గరున్న అణ్వాయుధాలకంటే 20 రెట్లు ఎక్కువ ఆయుధాలు తమ దగ్గరున్నాయని కిమ్ ను క్షనాల్లో అంతం చేయగల సత్తా ఉన్న అమెరికా ఆ పని చేయబోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిమ్ కు మతిచెడింది. ఏ క్షణంలోనైనా ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అమెరికన్ పత్రికలు వెల్లడించాయి.

# జనాభాలో చైనాను దాటేసిన భారత్‌!
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదీ? అంటే కొన్ని సంవత్సరాలుగా నిర్ద్వందంగా చైనా అని సమాధానం చెబుతున్నాం. కానీ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాదంటూ షాక్‌ ఇచ్చారు యి ఫుక్సియన్‌ అనే పరిశోధకుడు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్‌ అని ఆయన చెబుతున్నారు.

# పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి
ఇస్లామాబాద్‌: అక్రమంగా పాక్‌ జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పిచ్చింది. జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ మాలిర్‌ సల్మాన్‌ అంజిద్‌ సిద్ధిఖీ ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేశారు.

Comments

comments

Share this post

scroll to top