నేటి టాప్-10 వార్తలు (24-4-2017)

#1. దేశమంతా ఒకసారే ఎన్నికలు
దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై నిర్మాణాత్మకచర్చ ప్రారంభమైందని.. ఈ చర్చను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

#2. హెచ్‌-1బీ వీసా విషయంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లపై అమెరికా ఆరోపణలు
భారతీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌లపై అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. హెచ్‌-1బీ వీసాల లాటరీ వ్యవస్థలో ఈ రెండు కంపెనీలు అదనపు టికెట్‌లు ఉంచడం ద్వారా అన్యాయానికి పాల్పడ్డాయని విమర్శించింది.

#3. పోలిసుల పై దాడి చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలు !
పోలీసులతో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఓ పోలీస్ వాహనానికి నిప్పుపెట్టడంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. రాజస్థాన్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

#4. యుపి ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌
ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి విధులకు హాజరయ్యేలా యుపి సిఎం ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ ఆధారిత హాజరు వ్యవస్థ ఏర్పాటుకు ఆయన ఆదేశించారు.

#5. దీక్షలు విరమించిన తమిళనాడు రైతులు
కరువు సాయం, రుణ మాఫీ చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర గత 41 రోజులుగా ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులు దీక్షలు విరమించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి హామీతో తాత్కాలికంగా దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. 15 రోజుల్లోగా తమ సమస్యలను పరిష్కరిస్తామని పళనిస్వామి హామి ఇచ్చారని చెప్పారు.

#6. ప్రభాస్ 19వ సినిమా టైటిల్ సాహో
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా టైటిల్ విషయంలో స్పష్టత వచ్చింది. సాహో.. బాహుబలి2 సినిమాలోని ‘భళి భళి భళి రాభళి… సాహోరే బాహుబలి’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. అందులోని ‘సాహో’ను తాజా సినిమాకు టైటిల్‌గా తీసుకున్నారు.

#7. ఐదేళ్లలో 6 లక్షల లీటర్ల రక్తం వృథా !!
బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భారీగా రక్తం వృథా అవుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన ఐదేళ్లలో ఇలా వృథా అయిన రక్తం మొత్తం 28 లక్షల యూనిట్లు!! లీటర్లలో చెప్పాలంటే మొత్తం 6 లక్షల లీటర్ల రక్తం వృథా అయ్యింది.

#8. ఇకపై హిందీలో కూడా పాస్‌పోర్ట్‌ పొందవచ్చు
ఇకపై పాస్‌పోర్టు కోసం హిందీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారిక భాషపై పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించడంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

#9. నేటి నుంచి ఏపీ ఎంసెట్‌
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 2017–18 సంవత్సరానికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ ఎంసెట్‌–17 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం.

#10. 60 ఏళ్లు దాటితే వృద్ధులే
వివిధ ప్రయోజనాలనందించే విషయంలో ప్రభుత్వశాఖలు, ప్రైవేటు సంస్థలు 60 ఏళ్లు దాటినవారిని కచ్చితంగా వృద్ధులుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Comments

comments

Share this post

scroll to top