నేటి టాప్ న్యూస్ (23-04-2017)

# అమెరికాలో భారత సంతతి సర్జన్ జనరల్‌ను తీసేసిన ట్రంప్
అమెరికాలో మరో భారతీయుడికి అవమానం జరిగింది. ఆ దేశ అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది.

# తీవ్రస్థాయికి తమిళ రైతుల నిరసన
కరువుతో అల్లాడుతున్న తమను ఆదుకోవాలనే డిమాండ్‌తో దేశరాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద తమిళనాడు రైతులు 40 రోజుల క్రితం ప్రారంభించిన నిరసన శనివారం నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంది.

# ఆరు షోల్లో బాహుబలి సినిమా !
‘బాహుబలి ద కన్‌క్లూజన్‌’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు జనాల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బాహుబలి-2 సినిమాను తొలి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు మొత్తం 6 షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

# జియోకి గట్టి దెబ్బ ఇవ్వనున్న బీఎస్ఎన్ఎల్
రిల‌యన్స్ జియో ప్ర‌వేశ‌పెట్టిన ప్లాన్ల‌కు కౌంట‌ర్‌గా ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ త‌న ఖాతాదారుల‌కు కొత్త ప్లాన్ల‌ను ఆఫ‌ర్ చేస్తోంది. ట్రిపుల్ ఏస్ ప్లాన్ కింద 333 రూపాయల రీఛార్జ్ తో 90 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా వాడుకునే సౌకర్యం ఇస్తుంది. దీంతో 90 రోజుల పాటు 270 జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.

# ఈరోజు గ్రూప్‌-3 ప్రిలిమ్స్‌
అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-3 ప్రిలిమ్స్‌ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1430 కేంద్రాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌. పంచాయితీ కార్యదర్శి పోస్టులకు 5.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

# కర్ణాటకలో ‘బాహుబలి’కి గ్రీన్ సిగ్నల్‌!
‘బాహుబలి ది కన్‌క్లూజన’కు కర్ణాటకలో గ్రీన సిగ్నల్‌ లభించింది. ఈ సినిమా ప్రదర్శనకు అనుమతిస్తున్నట్టు, ఈ నెల 28న కర్ణాటక బంద్‌ పిలుపును వెనక్కి తీసుకుంటున్నట్టు కన్నడ సమాఖ్య (‘కన్నడ ఒకూట’) అఽధ్యక్షుడు వాటల్‌ నాగరాజ్‌ తెలిపారు.

# రూ.10 కాయిన్స్‌ చెల్లవంటూ పెట్రోల్‌ బంకుల్లో బోర్డులు
పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ కష్టాల నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా తేరుకోక ముందే మరో కరెన్సీ సమస్య వచ్చి పడింది. ఆర్‌బీఐ నూతనంగా ప్రవేశపెట్టిన పది రూపాయల కాయిన్స్‌ చెల్లవంటూ పెట్రోలు బంకుల్లో ఏకంగా బోర్డులు దర్శనమిస్తుండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు.

# రష్యాకు ఆంధ్ర మామిడి !
ఇరు ప్రాంతాలు పరస్పరం లబ్ధి పొందేలా స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి, దిగుమతి చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం, రష్యాలోని చెల్యాబినిస్క్‌ ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఏపీ నుంచి వరి, మామిడి, మసాలా దినుసులు, సిరామిక్‌ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు చెల్యాబినిస్క్‌ ఆసక్తి కనబరిచింది.

Comments

comments

Share this post

scroll to top