నేటి టాప్-10 న్యూస్ (20-04-2017)

#1. బాబీ మసీదు ధ్వంసం కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతిపై విచారణ
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో బిజెపి సీనియర్‌ నాయకులు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 14 మందిపై విచారణ చేపట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అనుమతులిచ్చింది.

#2. నేను హిందువునే కానీ.. బీజేపీ వారిలా కాదు : మమతా బెనర్జీ
పుట్టుకతో తాను హిందువునని అయితే హిందువులను అపఖ్యాతిపాల్జేసే బీజేపీ తరహా హిందుత్వకు వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె బుధవారం ఒడిషా-పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. మమతా బెనర్జీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకోకుండా అడ్డుకుంటామని బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.

#3.  వీడియోలు పెట్టిన బీఎస్‌ఎఫ్ జవాన్ బర్తరఫ్ !
భద్రతాబలగాలకు నాణ్యతలేని ఆహారం సరఫరా చేస్తున్నారని వీడియో తీసి సోషల్ మీడియాకెక్కి సంచలనం సృష్టించిన బీఎస్‌ఎఫ్ జవాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. సిబ్బంది వ్యవహారాల కోర్టు విచారణ నివేదిక మేరకు తేజ్‌బహదూర్‌ను సర్వీసు నుంచి తొలిగించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

#4. ఇక విఐపి కార్లకు ఎర్రబుగ్గ నిషేధం !
దేశంలో రాష్ట్రపతి, ప్రధాని సహా ఏ స్థాయి వ్యక్తి వాహనంపైనా వచ్చే నెల 1 నుంచి ఎర్రబుగ్గగాని, నీలిబుగ్గగాని కనిపించదు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేబినెట్‌ హోదాలో ఉన్న వ్యక్తులు, అత్యున్నతాధికారుల వాహనాలపై ఈ లైట్లు మాయం కానున్నాయి.

#5. తెలంగాణాలో పాఠశాలలకు ముందస్తు వేసవి సెలవులు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం ఈరోజు నుండి వేసవి సెలవులు ప్రకటించింది. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో బుధవారం నుంచే సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

#6. 4వేల కిలోల వరకు బరువు ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్ తయారు చేస్తున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దశను మార్చే తొలి డెవలప్‌మెంటల్‌ రాకెట్‌ జీఎస్‌ఎల్వీ మార్క్‌-3-డీ1ను తొలి సారిగా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ రాకెట్‌ 4 వేల కిలోల వరకు బరువు గల ఉపగ్రహాలను మోసుకెళ్లగలదని ఆయన చెప్పారు.

#7. 23న ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్
బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా పనుల్లో వేగం పెంచాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేసిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ను బాహుబలి రిలీజ్ కన్నా ఐదు రోజుల ముందే విడుదల చేస్తున్నారు.

#8. 2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమ్స్‌ !
వీడియో గేమ్స్‌ ఇక చిన్న పిల్లల ఆట మాత్రమే కాదు, దేశానికి పతకం సాధించి పెట్టే క్రీడగా మారనుంది. 2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమింగ్‌ను మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.

#9. ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాటెండ్‌ లిస్ట్‌లో మన భారతీయుడు
భార్యను చంపి పరారీలో ఉన్న భారతీయ యువకుడి పేరును అమెరికా నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. గుజరాత్‌కు చెందిన భద్రేష్‌ కుమార్‌ ను పట్టిచ్చిన వారికి లక్ష అమెరికన్‌ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది.

#10. అఖిల్ కొత్త మూవీ సరికొత్త రికార్డ్ !
అఖిల్ అక్కినేని ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్స్, ట్రైన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకించారు. హైదరాబాద్ మెట్రలో షూటింగ్ జరుపుకున్న తొలి మూవీ ఇదే.

Comments

comments

Share this post

scroll to top