నేటి టాప్-10 న్యూస్ (17-04-2017)

#1. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

#2. బ్రిటన్‌ రాణి రథం కావాలంటున్నడోనాల్డ్ ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు రాణి ఉపయోగించే బంగారు వర్ణపు వాహనంలో ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనివల్ల ఆయనకు భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని లండన్‌లోని భద్రతాధికారులు పేర్కొంటున్నారు.

#3. అకారణంగా తలాక్ అంటే బహిష్కరణే
ఇస్లామిక్ చట్టంలో పేర్కొన్నట్లుగా సరైన కారణాలు లేకుండా మూడుసార్లు తలాక్ చెప్పినవారు సాంఘిక బహిష్కరణకు గురవుతారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తెలిపింది.

#4. జియోకి దీటుగా ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ !
ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు మరో భారీ ఆఫర్‌ తీసుకొచ్చింది. వచ్చే మూడు నెలల పాటు తన పోస్ట్‌పెయిడ్‌ చందాదారులకు ఉచిత డేటాను అందించనున్నట్లు తెలిపింది.

#5. రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న రాందేవ్ బాబా
ఇప్పటికే రిటైల్ రంగంలో విజయం సాధించిన రాందేవ్ బాబా పతంజలి ఇప్పుడు రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెడ్తున్నారు. ఈ రెస్టారెంట్లకు ‘పోస్టిక్’ అని పేరు పెట్టారు. చండీగఢ్ లో మొదట్టి రెస్టారెంట్ ప్రారంభించారు.

#6. కిట్ లేదని మ్యాచ్ ఆడలేదు !
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో గుజరాత్ లయన్స్ హిట్టర్ అరోన్ ఫించ్ ఓ వింత కారణంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. గత మ్యాచ్ ఆడిన రాజ్ కోట్ నుంచి అరోన్ ఫించ్ కిట్ బ్యాగ్ ముంబైకి చేరేలేదట. దాంతో అతను మ్యాచ్ ఆడలేదు !

#7. 19వ శతాబ్దానికి చెందిన చివరి వ్యక్తి ఇకలేరు
ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ వయసున్న బామ్మగా రికార్డుల్లోకెక్కిన ఎమ్మా మార్టినా మోరానో తుదిశ్వాస విడిచారు. 117 సంవత్సరాలున్న మార్టినా ఉత్తర ఇటలీలోని వెర్బానియాలోగల తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారని స్థానికి మీడియా వెల్లడించింది.

#8. 11 ఏళ్లకే ఇంటర్ పూర్తి చేసిన అగస్త్య
11 ఏళ్లకే 12వ తరగతి ఉత్తీర్ణుడై రికార్డు సృష్టించాడు అగస్త్య జైస్వాల్‌ . హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోగల సెయింట్‌ మేరిస్‌ జూనియర్‌ కాలేజిలో చదువుతున్న అగస్త్య ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరాన్ని 63 శాతం మార్కులతో పాసయ్యాడు.

#9. పద్మావతి షూట్ క్యాన్సల్ చేసిన దీపికా !
దీపికా పదుకొనే మహారాణి పాత్రలో కనిపించబోతుంది. పాత్రలో నటిస్తున్న దీపికా పదుకొనేకు కూడా భారీ కాస్ట్యూమ్స్‌ను ఏర్పాటు చేశారు. దాంతో ఆమెకి మెడ పై గాయాలు అయ్యాయి. అందుకనే షూట్ క్యాన్సల్ చేయాల్సివచ్చింది.

#10. వాస్తు శాస్త్రం కోర్స్ ప్రారంభించనున్న ఐఐటి ఖరగ్పూర్
కేవలం ఇంజనీరింగ్ మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సులే కాదు త్వరలో వాస్తు శాస్త్రం కూడా నేర్పించనున్నారు ఐఐటి ఖరగ్పూర్.

Comments

comments

Share this post

scroll to top