నేటి టాప్-10 న్యూస్ (14-04-2017).

#1. ఇకపై పెళ్ళి తరువాత మహిళలు పాస్‌పోర్టులో ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు
ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ మహిళలకు శుభవార్త చెప్పారు. ఇకపై వారు తమ పుట్టినింటి పేరుతోనే పాస్‌పోర్ట్ పొందవచ్చన్నారు. మహిళలు తమ పాసుపోర్ట్‌లో మెట్టినింటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని మోదీ తెలిపారు.

#2. ఆఫ్గనిస్తాన్ పై అతి పెద్ద బాంబుతో దాడి చేసిన అమెరికా
‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును అమెరికా ఆఫ్గనిస్తాన్ దేశం పై ప్రయోగించిగంది. ఐసిస్‌ సొరంగాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ బాంబు ప్రయోగించారు.

#3. రాష్ట్రంలో 55 లక్షల రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర రైతులకు భారీ వరాలిచ్చారు. వచ్చే ఏడాది నుంచి 26లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ప్రతి ఎకరానికి 5 ఎరువుల బస్తాలను ఉచితంగా అందిస్తామని కేసీఆర్ చెప్పారు.

#4. విడుదల అయినా సచిన్ సినిమా ట్రైలర్
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు జేమ్స్ ఎర్‌స్కైన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌వి భ‌గ్‌చంద్కా, కార్నివాల్ మోష‌న్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించారు.

#5. అంతరిక్షం నుండి తీసిన భారతదేశం చిత్రాలను విడుదల చేసిన నాసా
రాత్రివేళ విద్యుత్‌ కాంతులతో వెలుగు జిలుగులు వెదజల్లుతూ కనువిందు చేస్తున్న భారతదేశ చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ విడుదల చేసింది. అంతరిక్షం నుంచి తీసిన ఈ ఉపగ్రహ చిత్రాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి.

6. విడుద‌లైన గురుకుల రీనోటిఫికేష‌న్- 18 నుండి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌.!

 

#7. ప్రశ్న పత్రాలు ప్రింట్ చెయ్యడం మర్చిపోయిన బీహార్ యూనివర్సిటీ.. వాయిదా పడిన పరీక్ష
బీహార్ రాష్ట్రం ప్రశ్న పత్రాల లీకేజీ విషయంలో ఫేమస్ కానీ ఈ సారి ప్రశ్న పత్రాలు ప్రింట్ చెయ్యడం మర్చిపోయారు ఒక విశ్వవిద్యాలయం వారు. తిలక మంజీ భాగల్పూర్ విశ్వవిద్యాలయం వారు ప్రశ్న పత్రాలు ప్రింట్ చెయ్యడం మర్చిపోవడంతో ఏప్రిల్ 22 కి వాయిదా పడింది.

#8. రికార్డులు బద్దలు కొట్టిన ఐపీల్-10
తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఐపీల్-10 తొలి మూడు మ్యాచ్‌లను రికార్డు స్థాయిలో 185.7 మిలియన్ల మంది వీక్షించారు. ఇది ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు అని నిర్వహకులు అంటున్నారు.

#9. అంతర్జాతీయ సదస్సుల నుండి ఆహ్వానం అందుకున్న కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానం అందింది. ప్రపంచ పర్యావరణ, నీటివనరుల కాంగ్రెస్‌కు హాజరుకావాలని అమెరికా ఇంజినీర్ల సంఘం ఆహ్వానించింది. ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి కూడా కేటీఆర్‌కు మరో ఆహ్వానం అందింది.

#10. ఉత్తర కొరియా పై దాడిచేసేందుకు పావులు కదుపుతున్న ట్రంప్
బిన్ లాడెన్‌కు పట్టిన గతే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు త్వరలో పట్టేలా ఉందని అంటున్నారు. గతంలో ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన ‘సీల్ టీమ్-6’ను డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాపై దాడి చెయ్యడానికి రహస్యంగా దక్షిణ కొరియాకు పంపినట్టు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top