నేటి టాప్-10 న్యూస్ (12-05-2017)

# నేడే తెలంగాణ ఎంసెట్‌
ఎంసెట్‌ 2017 రాత పరీక్ష శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య తెలిపారు. ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

# ఏ క్షణమైనా అమెరికాపై అణుదాడికి సిద్ధమే : ఉత్తర కొరియా
అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతోంది ఉత్తరకొరియా. అమెరికాపై హెచ్చరికలు చేస్తూ మరోసారి దుస్సాహసానికిపాల్పడింది. అణుబాంబుతో దాడిచేస్తే అమెరికాలో కోట్ల మంది ప్రజలు మరణిస్తారని తాజాగా హెచ్చరికలు చేసింది.

# నయీం కేసు విషయంలో ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
గ్యాంగ్‌స్టర్ నయీం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌ (మీర్‌చౌక్), సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు పడింది.

# ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం !
గత పదేళ్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఈ లీగ్ కు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసీస్ క్రికెటర్లకు పలురకాలైన జాతీయ కాంట్రాక్ట్లు అప్పజెప్పి వారిని ఐపీఎల్ కు దూరం చేయాలనేది ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) ఆలోచనగా ఉంది.

# ఖమ్మంలో రైతన్నకు సంకెళ్లు
ఖమ్మం మార్కెట్‌ యార్డు విధ్వంసం ఘటనలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సంచలనం సృష్టించింది. పోలీసులు అత్యుత్సాహంతో రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.

# పాన్‌కు ఆధార్ అనుసంధానం ఇక సులభం !
పాన్ కార్డ్‌ కు ‘ఆధార్’ను అనుసంధించేందుకు ఆదాయ పన్నుశాఖ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐటీ రిటర్న్‌లు దరఖాస్తు చేయడానికి ఇప్పుడు ఆధార్ కార్డు నెంబరును తప్పకుండా పాన్ కార్డుకు అనుసంధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖకు చెందిన ఇ-ఫిల్లింగ్ వెబ్‌సైట్ https://incometaxindiaefiling.gov.in లో కొత్తగా ఒక లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది.

# ముఖ్యమంత్రిపై విచారణాకు ఒప్పుకోము అంటున్న యూపీ ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను 2007 నాటి గోరఖ్‌పూర్ అల్లర్ల కేసులో విచారించేందుకు తాము అంగీకరించలేమని యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ తీసుకున్నారు.

# మాయావతి పై మాజీ మంత్రి ఆరోపణ
బీఎస్పీ అధినేత్రి మాయావతి తనను రూ.50 కోట్లు అడిగారని ఆ పార్టీ నుంచి సస్పెండైన మాజీ మంత్రి నసీముద్దిన్ సిద్దిఖ్వి ఆరోపించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని తాను అడిగితే ఆస్తులు అమ్మాలని మాయావతి అన్నారని, తన ఆస్తులు అమ్మినా అంత డబ్బు రాదని తాను చెప్పానన్నారు.

# చైనాలో భూకంపం : 8 మంది మృతి
చైనాలోని జింజియాంగ్‌ ప్రావిన్స్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్‌ జియలాజికల్‌ సర్వే వెల్లడించి. శిధిలాల కింద చిక్కుకుని 8 మంది మృతిచెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 700 మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

# మాజీ ప్రియుడితో నయనతార !!
ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాఫిక్‌ ఇదే. టాప్‌ కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. అయితే నిజజీవితంలో ప్రేమలో రెండుసార్లు ఓడిపోయిన ఈ అమ్మడు ఆ తరువాత కూడా నటిగా రాణించడం విశేషమే అవుతుంది. జీ ప్రియుడు ప్రభుదేవాతో నటింపజేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top