నేటి టాప్-10 న్యూస్ (11-05-2017)

# యువ ఆర్మీ అధికారిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన ఉగ్రవాదులు !!
సెలవులో ఉన్న ఓ యువ ఆర్మీ అధికారిని అపహరించిన మిలిటెంట్లు.. ఆపై అత్యంత దారుణంగా హతమార్చారు. షోపియాన్‌ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరైన రాజ్‌పుటానా రైఫిల్స్‌ అధికారిని కిడ్నాప్‌ చేసిన మిలిటెంట్లు.. అతనిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.

# ఎఫ్.బి.ఐ డైరెక్టర్ ని ఉద్యోగంలోంచి తీసేసిన ట్రంప్
అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఎఫ్.బి.ఐ డైరెక్టర్ జేమ్స్ జేమ్స్ కమీని హఠాత్తుగా తొలగించారు. ప్రజలకు తమపై నమ్మకం పుట్టడానికి ఈ పని చేసానని ట్రంప్ తెలిపారు.

# ఇప్పుడు జస్టిన్‌ బీబర్‌, తరువాత ఎడ్ షెరాన్ !!
సంగీత ప్రేమికులకు మరో శుభవార్త. ఇప్పుడు జస్టిన్‌ బీబర్‌ ముంబైలో షో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఎడ్ షెరాన్ కూడా త్వరలో ముంబైలో కన్సర్ట్ చెయ్యనున్నారు అని సమాచారం. నవంబర్ నెలల్లో ఈ ప్రోగ్రాం ఉంటుందని సమాచారం.

# జాధవ్‌పై స్టేను విశ్లేషించనున్న అంతర్జాతీయ న్యాయస్థానం
గూఢచర్యం కేసు లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాక్‌ సైనిక కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పును విశ్లేషిస్తున్నట్లు పాకిస్తాన్‌ బుధవారం ప్రకటించింది. కొద్దిరోజుల్లో దీనిపై ప్రకటన చేయనున్నట్లు పాక్‌ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తార్‌ అజీజ్‌ వెల్లడించారు.

# పార్లమెంట్‌లో బిడ్డకు పాలిచ్చిన రికార్డు సృష్టించిన ఎంపీ
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్నది. పార్లమెంట్ సెషన్స్ జరుగుతుండగా ఓ మహిళా సెనేటర్ తన బిడ్డకు పాలిచ్చారు. మాతృప్రేమకు ప్రాంతం, స్థలంతో సంబంధం లేదని చాటిచెప్పారు. అంతేకాదు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బిడ్డకు పాలిచ్చిన మొదటి తల్లిగా రికార్డు సాధించారు.

# గోడ కూలిపోవడంతో పెళ్లి వేడుకలో 25 మంది మృతి
రాజస్ధాన్‌లోని భరత్‌పూర్‌లో గురువారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి కోసం వచ్చిన బంధువులు భారీ వర్షం కురవడంతో దగ్గరలోని ఓ గోడ పక్కనే నిల్చున్నారు. అప్పటికే వర్షానికి బాగా తడిసిన గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మంది నలిగి ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది తీవ్ర గాయాలయపాలయ్యారు.

# టీఎస్ ఎంసెట్‌కు వెయ్యి బస్సులు
ఈ నెల 12న జరిగే టీఎస్ ఎంసెట్ 2017 పరీక్ష కోసం నగరంలో వెయ్యి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు గ్రేటర్ ఈడీ పురుషోత్తం నాయక్ తెలిపారు.

# అమెరికాలో ఉద్యోగులను పెంచనున్న కాగ్నిజెంట్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికాలో తన ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాలపై కఠిన నిబంధనలను అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకొంది కాగ్నిజెంట్.

# ఇండ్లు తగులబడుతుంటే ఎమ్మెల్యే సెల్ఫీ!
రాజస్థాన్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, తన నియోజకవర్గంలోని కొందరి ఇండ్లు కాలిపోతుంటే వాటి ముందు సెల్ఫీ దిగాడు. దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి తీవ్ర విమర్శలపాలయ్యాడు.

Comments

comments

Share this post

scroll to top