నేటి టాప్-10 న్యూస్ (03-05-2017)

# నేడు టెన్త్‌ ఫలితాలు
మరి కొన్ని గంటల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి.ఈ తరుణంలో విద్యార్థులంతా ఊపిరి బిగపట్టి ఉత్కంఠతకు లోనవుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అధికారులు సైతం టెన్షన్‌కు లోనవుతున్నారు.

# నకిలీ పాన్‌కార్డుల నియంత్రణ కోసం ఆధార్‌ తప్పనిసరి
పాన్‌ కార్డుల జారీకి ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సమర్థించుకుంది. దేశవ్యాప్తంగా నకిలీ పాన్‌ కార్డుల వినియోగాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

# విజయమాల్యాను పట్టుకోవడం కోసం లండన్‌ వెళ్ళిన సిబిఐ !!
మనీ లాండరింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న విజయమాల్యాను తిరిగి భారత్‌ రప్పించే ప్రయత్నాలను అధికారులు వేగవంతం చేశారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేష్‌(సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌(ఇడి) అధికారుల ఉమ్మడి బృందం లండన్‌ చేరుకున్నారు.

# మళ్లీ గవర్నర్‌గా ఎంపిక అయినా నరసింహన్‌ !
గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా కొనసా గనున్నారు. తాత్కా లికంగా ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

# కిమ్ జాంగ్ 3వ ప్రపంచ యుద్ధం హెచ్చరిక !!
అమెరికా మిలిటరీ నిర్వహిస్తున్న డ్రిల్స్, రెచ్చగొట్టే పద్ధతుల పట్ల కిమ్ ఆగ్రహంగా ఉన్నారని, త్వరలోనే అణుదాడి చేయడానికి సిద్దంగా ఉన్నారని ఉత్తర కొరియా స్థానిక పత్రిక పేర్కొంది.

# ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం !! భారీగా అమెరికన్ల నియామకాలు !!
దేశీయ అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్త్ను హెచ్‌1బీ వీసాలపై కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లను ఉద్యోగులుగా నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

# దినకరన్ మీద మరో కేసు నమోదు
అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి ఏకంగా ఎన్నికల యంత్రాగానికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి టీటీవీ దినకరన్ ను అరెస్టు చేసి తీహార్ సెంట్రల్ జైలుకు తరలించారు.

# జనవరి టు డిసెంబర్ ఆర్థిక సంవత్సరానికి కేబినెట్ ఆమోదం
ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు అమలు చేసేందుకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ ఆర్థిక ఏడాదిని ముందుకు జరపాలని ప్రతిపాదించగా, దాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

# ఇది ప్రపంచంలోనే విలాసవంతమైన రైలు !!
జపాన్‌లో ఓ విలాసవంతమైన రైలును త్వరలో ప్రారంభించనున్నారు. జపాన్‌ రాజధాని టోక్యో నుంచి ఈశాన్య జపాన్‌లోని హొకాయిడోకు నాలుగురోజుల ట్రిప్‌గా దీన్ని నడపనున్నారు. 33మంది మాత్రమే ప్రయాణించే అవకాశమున్న ఈ రైలులో ఒక్కొక్కరికీ టికెట్‌ ధరను 10వేల డాలర్లుగా నిర్ణయించారు.

#  రష్యా సాయం కోరిన ట్రంప్
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను ఫోన్‌లో సంప్రదించారని, సిరియాలో తమ దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని చర్చించినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు.

Comments

comments

Share this post

scroll to top