నేటి టాప్-10 న్యూస్ (01-06-2017)

# కాబూల్‌లో భారీ పేలుడు !!
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను భారీ పేలుడు కుదిపేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. శక్తిమంతమైన పేలుడు సంభవించడంతో ఈ ప్రాంతంలో ఉన్న దౌత్య కార్యాలయాల భవనాల అద్దాలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

# నోట్ల రద్దుతో మూడేళ్ల కనిష్ఠానికి జిడిపి
2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.1 శా తంగా నమోదైన జిడిపి మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 6.1 శాతా నికి తగ్గుముఖం పట్టింది. ఇంతలా తగ్గడానికి కారణంగా 2016 నవంబర్ 9న డిమానిటైజేషన్ ప్రకటన చేయడంతో ఆ తర్వాత త్రైమాసిక వృద్ధి రేటుపై ప్రభావం చూపింది.

# 2016 సివిల్స్ ఫలితాలు విడుదల
2016 సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ, గ్రూప్-బీ విభాగాల్లో మొత్తం 1099 మంది అభ్యర్థులు సెలక్ట్ అయ్యారు. కర్ణాటకకు చెందిన కే.ఆర్.నందిని ప్రథమ స్థానం దక్కించుకుంది.

# ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరిన రాజస్థాన్ హైకోర్టు
రాజస్థాన్ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఆవులను చంపేవారికి ప్రస్తుతం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నారని గుర్తు చేసింది. అయితే ఆవును చంపితే ఇక ముందు జీవితఖైదు విధించాలని రాజస్థాన్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి శిఫారస్సు చేసింది.

# మోస్ట్ 100 ఫేమస్ అథ్లెట్ల జాబితాలో కోహ్లీ, ధోని
భూమిపై టాప్ 100 మోస్ట్ ఫేమస్ అథ్లెట్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు చోటు దక్కించుకున్నారు. ఈఎస్పీఎన్ విడుదల చేసిన టాప్ క్రికెటర్ల జాబితాలో కోహ్లీ గతేడాదితో పోలిస్తే ఐదు స్ధానాలు దిగజారి 13వ స్ధానంలో నిలవగా, ధోని కూడా రెండు స్ధానాలు దిగజారి 15వ స్ధానంలో నిలిచాడు.

# పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెట్రోల్ ధర లీటరుకు 1.23 రూపాయలు, డీజిల్ పై 0.89 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో నేటి అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమలు అయ్యాయి.

# లండ‌న్‌లో తెలంగాణారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
టీఆర్ఎస్‌, కేసీఆర్‌ మద్దతుదారులు సంఘం ఆధ్వ‌ర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి ప్రవాస తెలంగాణా బిడ్డలు మరియు ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు హాజర‌య్యారు.

# విద్యార్థుల బస్‌పాస్‌లు ఇక ఆన్‌లైన్‌లో
ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకిచ్చే ఫ్రీ, స్టూడెంట్‌ జనరల్‌, స్టూడెంట్‌ గ్రేటర్‌, స్టూడెంట్‌ స్పెషల్‌, స్టూడెంట్‌ ఎక్స్‌క్లూజివ్‌, డిస్ర్టిక్ట్‌ రూట్‌ పాస్‌లన్నీ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు.

# భారత్, స్పెయిన్‌ల మధ్య ఏడు ఒప్పందాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పెయిన్ అధ్యక్షుడు మరియానో రాజోయ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు కీలక అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఖైదీల పరస్పర అప్పగింత, దౌత్య సంబంధమైన పాస్ పోర్టు కలిగిన వారికి వీసా రద్దు తో పాటు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, సైబర్ సెక్యూరిటీ, విద్యుత్‌చ్ఛక్తి, పౌర విమానయానం వంటి అంశాలపై ఒప్పందాలు కుదిరాయి.

# మహాత్మగాంధీకి డల్లాస్‌లో ఘన నివాళి
అమెరికా దేశ సంరక్షణ కోసం అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా వారికి నివాళులు అర్పించారు. ఈ తరుణంలో డాల్లస్‌లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్‌ వద్ద విశ్వశాంతికై కృషి చేసిన జాతి పిత మహాత్మా గాంధీకి.. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర నివాళులు అర్పించారు.

Comments

comments

Share this post

scroll to top