ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన 10 ఎయిర్‌పోర్టులు ఇవి తెలుసా..?

విమానాన్ని న‌డ‌ప‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. ఎన్నో కంట్రోల్స్ గురించి పైల‌ట్ల‌కు తెలిసి ఉండాలి. విమానాన్ని ఎలా టేకాఫ్ చేయించాలి, ఎలా ల్యాండ్ చేయించాలి, ఎలాంటి ఎయిర్‌పోర్టులో ఎలా విమానాన్ని దించాలి, ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లో ఎలా స్పందించాలి.. త‌దిత‌ర అనేక విష‌యాల‌పై పైల‌ట్ల‌కు బాగా అవ‌గాహన ఉండాలి. అప్పుడే విమానాల్లో ఎవ‌రైనా సేఫ్ గా ప్ర‌యాణించ‌గ‌లుగుతారు. అయితే నిజానికి విమానాల‌ను న‌డ‌ప‌డం ఒకెత్తు అయితే విమానాల‌ను ల్యాండ్ చేయించ‌డం కూడా మ‌రొక ఎత్తు. ఎందుకంటే కొన్ని ప్ర‌దేశాల్లొ ఎయిర్‌పోర్టులు ప‌ర్వతాలు, స‌ముద్రాల వంటి దుర్ల‌భ‌మైన ప్రాంతాల నడుమ ఉంటాయి. క‌నుక వాటిల్లో విమానాల‌ను ల్యాండ్ చేయించ‌డం మామూలు విష‌యం కాదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచంలో ఉన్న అలాంటి క్లిష్ట‌త‌ర‌మైన ఎయిర్‌పోర్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. నేపాల్ లో ఉన్న లుక్లా ఎయిర్ పోర్టు. దీని చుట్టూ ప‌ర్వ‌తాలు ఉంటాయి. ల్యాండింగ్‌, టేకాఫ్ క‌ష్టంగా ఉంటుంది.

2. కోర్‌చెవెల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు. ఫ్రాన్స్‌లో ఉంది. ఇక్క‌డ ఎగుడు దిగుడుగా ఉండే ర‌న్‌వే ప‌ర్వ‌తాల‌పై ఉంటుంది.

3. గిబ్రాల్ట‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు. ఇక్క‌డ విమానాలు దిగేందుకు ఎయిర్‌పోర్టు, ర‌న్ వే లేదు. రోడ్ల‌పైనే దిగుతాయి.

4. హోండ్యూరాస్, టెగుకిగాల్పా ట‌న్‌కోంటిన్ ఎయిర్ పోర్టు. ఇక్క‌డ కూడా చుట్టూ ప‌ర్వ‌తాలు ఉంటాయి.

5. హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఉన్న భూటాన్ పారో ఎయిర్‌పోర్టు. ఇక్క‌డ కూడా ఎయిర్‌పోర్టు చుట్టూ ప‌ర్వ‌తాలు ఉంటాయి.

6. సెయింట్ మార్టిన్‌లో ఉన్న ప్రిన్సెస్ జూలియానా ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు. దీని చుట్టూ స‌ముద్రం ఉంటుంది.

7. అంటార్కిటికాలో ఉన్న మెక్‌ముర్డో ఎయిర్ స్టేష‌న్‌. దుర్భేధ్య‌మైన మంచు ప‌ర్వ‌తాలు ఇక్క‌డ ఉంటాయి.

8. మాదెయిరా ఎయిర్ పోర్టు. ఇక్క‌డ విమానాల‌ను నిట్ట నిలువుగా ర‌న్ వే మీద‌కు దించాలి. ఇది చాలా క‌ష్ట‌సాధ్య‌మైన పని.

9. ల‌క్ష‌ద్వీప్‌లో ఉన్న అగ‌ట్టి ఎయిర్‌పోర్టు. ఇక్క‌డ ర‌న్‌వే ఓ ద్వీపంలా ఉంటుంది. దీనిపై విమానాల‌ను ల్యాండ్ చేయించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని.

10. గ్రీన్ ల్యాండ్‌లో ఉన్న న‌ర్సార్‌సువాక్ ఎయిర్‌పోర్టు. ఇక్క‌డ కూడా చుట్టూ ప‌ర్వ‌తాలు, స‌ముద్రం ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top