ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన భవనాలను మీరు ఎప్పుడైనా చూశారా. వాటి యజమానులు ఎవరో అయినా తెలుసా.. కనీసం అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా. తెలియదా.. అయితే ఈ సమాచారం మీకోసమే. మీ కళ్లు నమ్మలేని నిజాలు ఇప్పుడు చెప్పబోతున్నాం. వేల కోట్ల రూపాయలతో నిర్మితమై.. అత్యంత విలాసవంతమైన భవనాలుగా పిలవబడుతున్న టాప్ టెన్ భవంతుల వివరాలు చెప్పబోతున్నాం. మరో విశేషం.. ఈ టాప్ టెన్ ఖరీదైనా భవంతుల లిస్ట్ లో ఓ భారతీయుడి ఇళ్లు కూడా ఉంది. అతనెవరో ఆ ఖరీదైనా భవనం ఎక్కడ ఉందో ఓ లుక్కేయండీ.
1. బ్రూనై సుల్తాన్ హస్సనల్ బొల్కాయి నివాసం.. ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన భారీ కట్టడం. ఈ ఇంటి నిర్మాణానికి ఏకంగా 1.4 బిలియన్ డాలర్ల ఖర్చయింది. 2.15 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు సుల్తాన్ హస్సనల్. ఈ ఖరీదైన భవంతిలో ఒకే సారి 1500 మంది విశ్రాంతి తీసుకోవచ్చు. అంతే కాదు 1788 గదుల నిర్మాణం కలిగి 257 బాత్రూంలు కలిగి మసీద్ ఆకృతిలో ఉన్న అత్యంత గొప్ప భవనం ఇది. ఈ భవంతి లోపల 200 గుర్రాలకు ఎయిర్ కండిషన్ రూంలను కూడా నిర్మించారు. 110 కార్లను ఒకే సారి పార్క్ చేసుకునేల భారీ పార్కింగ్ ప్లేస్ ను నిర్మించారు. ఇక అత్యంత అద్భుతమైన కట్టడాన్ని ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ లియాండ్రో వి లోసియన్ డిజన్ చేశారు.
2. ఎన్ని వింతలున్నా అందులో భారత్ కు చోటు ఉండటం ఖాయం. ఈ ప్రపంచ అధ్బుత కట్టడాల లిస్ట్ లో కూడా భారత్ కు రెండో స్థానం దక్కింది. దీనికి కారణం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. ఆర్థిక రాజదాని అయిన ముంబైలో అది కూడా అత్యంత రద్దీగా ఉండే నగరం లో 400,000 చదరపు అడుగుల ఎత్తుతో ఓ భారీ భవంతి నిర్మించుకున్నారు ముఖేష్ అంబానీ. ఈ భవనంలో 4 అంతస్తుల ఓపెన్ తోట, భారీ వైన్ గది, సినిమా థియేటర్ కలిగిన నిర్మాణం ఉంది. 150 మీటర్ల ఎత్తు ఉన్న ఈ భవనం ఖరీదు $2 బిలియన్స్.
3. ఇక ముచ్చటగా మూడో స్థానం దక్కించుకున్న భవంతి ఇది. 110,000 చదరపు అడుగుల విశాలమైన ఈ విల్లా అమెరికన్ రిచెస్ట్ బిజినిస్ మ్యాన్ ఇరా రెన్నెర్ట్ నివాసం ఉంది. దీని నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాల $ 170 మిలియన్స్. దీని ప్రత్యేకత విశాలమైన స్థలాన్ని కలిగి ఉన్న ఓ అందమైన భవనం. ఈ భవనం ముందు ఖాళీ స్థలంలో ఒక బాస్కెట్బాల్ కోర్టు , రెండు స్క్వాష్ కోర్టులు, రెండు టెన్నిస్ కోర్టులు నిర్మాణం ఉంది. ఇందులో మరో ప్రత్యేకత $ 150,000 విలువ చేసే ఒక భారీ హాట్ టబ్ ఉంది.
4. వెస్ట్ గేట్ రిసార్ట్స్ డేవిడ్ సీగల్ ప్రత్యేకంగా నిర్మించుకున్న భవంతి టాప్ 4 లో ఫ్లేస్ దక్కించుకుంది. 90,000 చదరపు అడుగులతో నిర్మితమైన ఈ నివాసంలో రెండు సినిమా థియేటర్లు, 8,000 చదరపు అడుగుల మాస్టర్ సూట్, 15 బెడ్ రూములు, 11 వంటశాలలలో, 6 కొలనులు మరియు 30 కార్లు పార్క్ చేసుకునేందుకు వీలుగా అండర్ గ్రౌండ్ గ్యారేజ్ ఉంది.
5. మాట్రిక్స్ ఎస్సెన్షియల్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు శ్యాండిల్ మిల్లర్ కు చెందిన భవనం ఇది. ఫ్లోరిడాలోని పాలెం బీచ్ కు దగ్గరలో ఉన్న ఈ భవంతి ప్రపంచంలో టాప్ 5 స్థానాన్ని దక్కించుకుంది. 84.626 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నిర్మితమై ఉంది.
6. చూడగానే హౌరా అనిపించేలా కనిపిస్తున్న ఈ భవంతి అత్యంత పటిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. విపత్తుల నుండి తట్టుకునే విధంగా అత్యంత దృడమైన రాయితో దీన్ని నిర్మించారు. 72,000 చదరపు అడుగుల విస్తర్ణంలో ఉన్న ఈ భవనం అణుబాంబు శక్తిని కూడా తట్టుకుంటుదంటా.
7. చుట్టు పచ్చదనాన్ని సంతరించుకున్న ఈ భవనం ప్రపంంలో కెల్లా అత్యంత సంపన్నుడు బిల్ గేట్స్ ఎంతగానే ఇష్టపడి నిర్మించుకున్న భవనం. 2,100 చదరపు అడుగుల లైబ్రరీ చుట్టు భారీ వృక్ష సంపద పర్యావరణాన్ని ఆస్వాదించే విధంగా నిర్మించుకున్న ఈ కట్టడం 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
8. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగారు, వజ్రాలను పైన అమర్చబడి నిర్మితమైన అత్యంత ఖరీదైన భవనాల్లో 8 వ స్థానం దక్కించుకున్న ఈ కట్టడం ప్రస్తుత యూఎస్ఏ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ది.
9. సముద్రానకి ఆనుకుని చుట్టు పచ్చని ప్రకృతి నడుమ నిర్మితమైన ఈ కట్టడం.. ఫార్ములా వన్ సీఈఓ కూతురు పెట్రా ఎక్లోస్టన్ ది. 56.500 చదరపు అడుగుల విస్తీర్ణంలోఉన్న ఈ భవంతి ఖరీదు $ 150 మిలియన్లు.
10. చుట్టు మంచు కొండల నడుమ 56,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవనం టాప్ 10 లో స్థానం దక్కించుకుంది. దీని యజమాని హెడ్జ్ ఫండ్ మేనేజర్ జాన్ పాల్సన్. దీని ఖరీదు $135 మిలియన్లు.