MOST DESIRABLE MEN-2016 లిస్ట్ వచ్చేసింది..! టాప్ 10 లో ఆ టాప్ హీరో లేడు..?

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన నటులు చాలామందే ఉన్నారు. ఎవరి అభిమానులు వారి హీరోలే గొప్ప అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ప్రతిష్ఠాత్మక పోల్స్ మాత్రం విరుద్ధమైన ఫలితాలనిస్తుంటాయి. ఏటా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులెవరంటూ టైమ్స్ గ్రూప్ ఓ సర్వే చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్ పోల్ నిర్వహించింది. ఆ పోల్‌లో జాతీయ వ్యాప్తంగా, తెలుగు రెండు విభాగాల్లోనూ మిస్టర్ వరల్డ్-2016గా ఎంపికైన రోహిత్ ఖండెల్వాల్ టాప్‌గా నిలిచారు. టాలీవుడ్ ప్రిన్స్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు జాతీయవ్యాప్తంగా ఏడో స్థానాన్ని సంపాదించారు. నిరుటితో పోలిస్తే ఒకస్థానాన్ని కోల్పోయారు మహేశ్. గత ఏడాది మహేశ్ ఆరో స్థానంతో దక్షిణాది స్టార్ హీరోలకు సాధ్యం కానిదానిని సాధించారు.

తాజా పోల్‌లో తెలుగు పరంగా చూస్తే.. మహేశ్ రెండో స్థానంలో నిలవడం విశేషం. గత ఐదేళ్లుగా బాహుబలి ప్రభంజనం కొనసాగినా.. ప్రభాస్ గానీ, రానా గానీ టాప్‌3లో చోటు దక్కించుకోలేకపోయారు. విశేషమేంటంటే.. విలక్షణ సినిమాలతో అలరిస్తూ నేచురల్ స్టార్‌గా ఖ్యాతిగడించిన నాని తెలుగులో టాప్-3లో ఉండడం. ఏ స్టార్ హీరో కూడా సాధించలేనిది నాని సాధించడం విశేషం. ఇక, నాని తర్వాత నాలుగో స్థానంలో రానా, ఐదో స్థానంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నిలిచారు. ఇక, విశేషాభిమానులున్న పవన్ కల్యాణ్.. ఈ జాబితాలో టాప్ టెన్‌లోనే లేకపోవడం గమనార్హం. పవర్‌స్టార్ 11వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక, ఆరో స్థానంలో ప్రభాస్, ఏడోస్థానంలో నాగచైతన్య, 8వ స్థానాన్ని అల్లు అర్జున్, 9వ స్థానాన్ని సుధీర్ బాబు, 10వ స్థానాన్ని నాగశౌర్య దక్కించుకున్నారు.

Comments

comments

Share this post

scroll to top