ఆర్మీ పవర్‌లో ప్రపంచంలోని టాప్ 10 దేశాలు ఇవే..! భారత్, పాక్‌లు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసా..?

ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు చాలా కీలకమని అందరికీ తెలిసిందే. వాటితోనే ఆయా దేశాలు తమ శత్రు దేశాలను నాశనం చేస్తాయి. ఇక ఈ దళాలకు తోడు ట్యాంకర్లు, ఆయుధ సామగ్రి వేరే. అయితే మీకు తెలుసా..? ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏయే దేశం వద్ద ఎంత ఆయుధ సామగ్రి ఉందో, ఏ దేశానికి పైన చెప్పిన మూడు దళాలకు చెందిన సిబ్బంది, అధికారులు ఎక్కువగా ఉన్నారో..? ఆర్మీ పవర్‌లో టాప్ 10లో ఎవరు ఉన్నారో.. అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. అమెరికా
ఈ దేశం ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్ దళాల్లో ప్రపంచంలోనే టాప్ స్థానంలో ఉంది. మొత్తం దాదాపుగా అన్ని దళాల్లోనూ కలిపి 42.20 లక్షల సిబ్బంది ఉన్నారు. వీరి వద్ద యుద్ధ విమానాలు 13,762 ఉండగా, ఫిరంగులు 5,884, నావీ షిప్‌లు 415 ఉన్నాయి.

2. రష్యా
ఆర్మీ పవర్‌లో రష్యా 2వ స్థానంలో ఉంది. అన్ని దళాల సిబ్బంది మొత్తం 13.55 లక్షలు ఉన్నారు. విమానాలు 3,794, ఫిరంగులు 20,216, షిప్‌లు 352 ఉన్నాయి.

3. చైనా
1.95 కోట్ల ఆర్మీ సిబ్బంది వీరి వద్ద ఉన్నారు. 2,955 విమానాలు, 6,457 ఫిరంగులు, 714 షిప్‌లు ఉన్నాయి.

4. భారత్
2.29 కోట్ల మంది ఆర్మీ సిబ్బంది అన్ని దళాల్లోనూ ఉన్నారు. విమానాలు 2102, ఫిరంగులు 4,426, షిప్‌లు 295 ఉన్నాయి.

5. ఫ్రాన్స్
7.75 లక్షల ఆర్మీ సిబ్బంది ఉన్నారు. 1305 విమానాలు ఉన్నాయి. 406 ఫిరంగులు ఉన్నాయి. 118 షిప్‌లు ఉన్నాయి.

6. యూకే
7.50 లక్షల ఆర్మీ సిబ్బంది ఉన్నారు. 856 విమానాలు, 249 ఫిరంగులు, 76 షిప్‌లు ఉన్నాయి.

7. జపాన్
12.15 లక్షల మంది ఆర్మీ సిబ్బంది జపాన్‌కు ఉన్నారు. 1594 విమానాలు, 700 ఫిరంగులు, 131 షిప్‌లు ఉన్నాయి.

8. టర్కీ
13.75 లక్షల ఆర్మీ సిబ్బంది వీరికి ఉన్నారు. 1018 విమానాలు, 2445 ఫిరంగులు, 194 షిప్‌లు ఉన్నాయి.

9. జర్మనీ
7.91 లక్షల ఆర్మీ సిబ్బంది వీరికి ఉన్నారు. 698 విమానాలు, 543 ఫిరంగులు, 81 షిప్‌లు ఉన్నాయి.

10. ఇటలీ
5.70 లక్షల మంది ఆర్మీ సిబ్బంది వీరికి అన్ని దళాల్లోనూ ఉన్నారు. 822 యుద్ధ విమానాలు, 200 ఫిరంగులు, 143 నావీ షిప్‌లు వీరికి ఉన్నాయి.

ఇక మన శత్రు దేశమైన పాక్ టాప్ 10 ఆర్మీ పవర్ దేశాల జాబితాలో లేకపోవడం గమనార్హం. పాక్ ఈ లిస్ట్‌లో 13వ స్థానంలో ఉంది. ఆ దేశంలో మొత్తం ఆర్మీ సిబ్బంది 43.45 లక్షల మందే ఉన్నారు. ఇక యుద్ధ విమానాలు 951, ఫిరంగులు 2924, నావీ షిప్‌లు 197 ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top