నేటి టాప్-10 న్యూస్ (18-04-2017)

#1. తమిళ రాజకీయాల్లో కొత్త ట్వీస్ట్ !
తమిళనాడులో శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దినకరన్‌ బుక్కయ్యారు. దీంతో మంత్రులంతా పనీర్ సెల్వం టీంలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

#2. ఏపీలో తారక్ పార్టీ.. నిజమేనా !!
తాజాగా ఎన్టీఆర్‌ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో హల్‌చల్ నడుస్తోంది. దానికి సంబంధించి.. ‘నవభారత్ నేషనల్ పార్టీ- భద్రతే మా లక్ష్యం.. మానవతే మా నినాదం’ పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

#3. సోనూ నిగమ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ వివాదాస్పద వ్యాఖ్యలతో పెనుదుమారం రేపాడు. దేవుడు అందరినీ దీవించాలి తెల్లవారు జామున మసీదు నుంచి వచ్చే అజా నిద్ర పాడుచేస్తోంది నేను ముస్లింను కాదు అజాతో నన్ను ఎందుకు నిద్ర లేపాలి? అంటూ ట్వీట్ చేసాడు.

#4. ఉగ్రవాదంటూ 3నెలల చిన్నారిని ప్రశ్నించారు !
ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మూడు నెలల చిన్నారిని విచారించారట లండన్‌లోని అమెరికా దౌత్యాధికారులు. చిన్నారి తాత పొరబాటుగా అతడిని ఉగ్రవాది అని పేర్కొనడమే ఇందుకు కారణం.

#5. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఎండల వేడి నిప్పుల వాన కురుస్తుందా అన్నతీరుగా ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా దాదాపు 5 డిగ్రీలు అదనంగా పెరుగుతున్నందున వడగాలులు సైతం వీస్తున్నాయి. వందేళ్లలో గత ఏడాది (2016)అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డుల్లోకెక్కింది.

#6. ఇకపై రాష్ట్రపతి , కేంద్ర మంత్రులు హిందీలోనే స్పీచ్ ఇవ్వాలి
ఇక నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు హిందీ వచ్చినట్టు అయితే హిందీలోనే స్పీచ్ ఇవ్వాలి. ఈ విషయం పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమోదం తెలిపారు.

#7. చిన్నారిని ఎత్తుకోడానికి కాన్వాయ్‌ ఆపిన మోడీ
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఓ చిన్నారి కోసం కాన్వాయ్‌ ఆపించి మరీ పాపతో ముచ్చటించారు. కాన్వాయ్‌ వైపు నాన్సీ అనే నాలుగేళ్ల చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్లింది. చిన్నారిని చూసిన మోడీ వెంటనే తన కాన్వాయ్‌ ఆపించారు.

 

#8. ఈ ఆటో డ్రైవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు
బెంగళూరుకు చెందిన వరిజశ్రీ వేణుగోపాల్‌ గాయని. ఈనెల 11న వీసా ఇంటర్వ్యూకోసం ఆమె హైదరాబాద్‌ వచ్చారు. అక్కడ రూ.5వేలు చెల్లించాల్సి ఉంది. ఆమె వద్ద కేవలం 2000 మాత్రమే ఉన్నాయి. దాంతో ఒక ఆటో అతను తనకు డబ్బు ఇచ్చి సహాయపడ్డాడు అని తెలిపింది.

#9 . అభిమాని రాసిన లేఖకు స్పందించిన సచిన్
ఓ అభిమాని లెటర్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రతిస్పందించాడు. రణ్ గాంధీ అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడికి సచిన్‌ అంటే ఎంత ఇష్టమో లేఖ రూపంలో వివరించాడు. ఆ లేఖను సచిన్ తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానుల కోసం పోస్టు చేశాడు. దాంతో అది వైరల్ అయింది.

#10. టైర్‌ మారుస్తుండగా రూ.కోటి నగలు మాయం చేసిన దుండగులు !
ఓ నగల వ్యాపారి దృష్టి మరల్చి 3.5 కిలోల బంగారు ఆభరణాల బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Comments

comments

Share this post

scroll to top