నేటి టాప్-10 న్యూస్ (16-04-2017)

#1. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంటర్‌ ఫలితాలు
నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు. ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

#2. భారతదేశాని పేద దేశం అన్న స్నాప్ చాట్ సీఈవో
స్నాప్‌చాట్‌ సీఈవో ఇవాన్ స్పీగెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ వ్యాపారాన్ని విస్తరించేంత సీన్‌ భారత్‌కు లేదన్నట్టు ప్రవర్తించాడు. భారతదేశంలాంటి పేద దేశంలో స్నాప్‌చాట్‌ వ్యాపార విస్తరణ అవసరం లేదని వ్యాఖ్యానించాడు.

#3. భువనేశ్వర్‌లో ప్రధాని మోడీ రోడ్‌ షో, తరలివచ్చిన జనసంద్రం
జాతీయ కార్యవర్గ సదస్సుకు ముందు ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించి.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. మోడీని చూడడానికి అని చెప్పి దాదాపు డెభై వేల మంది విచారం సమాచారం.

#4. శశికళ మేనల్లుడు టి.వి.మహాదేవన్ మృతి
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వి.కె.శశికళ మేనల్లుడు టి.వి.మహాదేవన్ (47) శనివారంనాడు కన్నుమూశారు. గుండెపోటుతో కోడంబాక్కంలో ఆయన మృతిచెందినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

#5. మూగ, చెవిటి పాత్ర చేయనున్న తమన్నా
ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న తమన్నా, తరువాత బాలీవుడ్ దర్శకుడు వసు భగ్నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుందట.

#6. ఢిల్లీ మెట్రోస్టేషన్ లో అశ్లీల వీడియో
ఢిల్లీ మెట్రో స్టేషన్ లో సిబ్బంది నిర్లక్ష్యం…ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లోని ఓ టీవీ బిగ్ స్క్రీన్ లో పోర్న్ వీడియో ప్లే అయింది. దీంతో ప్రయాణికులంతా షాక్ అయ్యారు.

#7. సిరియాలో ఆత్మాహుతి దాడి దాదాపు 70 మంది మృతి
సిరియాలోని షియాలే లక్ష్యంగా శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది మరణించారు. అలెప్పో రాష్ట్రంలోని రషిదీన్‌ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దుండగులు ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడి మారణహోమం సృష్టించారు.

#8. ఐసెట్‌ దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరితేది
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్‌ ఐసెట్‌-2017 పరీక్షకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 59,825 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షను మే 18న నిర్వహిస్తారు.

#9. పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు
పెట్రోల్ ధర ఒక లీటర్ మీద 1.39 రూపాయలు పెంచారు. ఇంకా డీజిల్ కూడా ఒక లీటర్ మీద 1.04 రూపాయలు పెంచారు. నిన్న రాత్రే ఈ మార్పు చోటు చేసుకుంది.

10. ఈరోజు సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌
సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో నేడు సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌ తలపడనున్నారు. తొలిసారి ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య సూపర్‌ సిరీస్‌ తుదిపోరు. ఉదయం 10:30 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం.

Comments

comments

Share this post

scroll to top