9 వ తరగతి అమ్మాయి సూసైడ్ లెటర్ లో ఏం రాసిందో తెలుసా.? తప్పు స్కూల్ దా.? తల్లితండ్రులదా.?

ఫీజు కట్టలేదనే అవమానం.. ఎప్పుడు ఫీజు కడతావ్ అంటూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దబాయింపు.. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనీయం అని వార్నింగ్ ఇచ్చిన టీచర్స్.. ఈ మొత్తం ఘటనను అవమానంగా భావించిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సారీ మామ్ అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి.. ప్రాణాలు తీసుకున్నది. హైదరాబాద్ మల్కాజిగిరి JLS నగర్ లో ఈ ఘటన జరిగింది. బాలకృష్ణ, సునీత భార్యాభర్తలు. బాలకృష్ణ పెయింటర్‌. సునీత సూపర్‌ మార్కెట్‌ లో పని చేస్తోంది. వీరికి సాయిలత, సాయిదీప్తి (14) ఇద్దరు కుమార్తెలు. సాయిలత బీటెక్‌ చదువుతుండగా.. సాయిదీప్తి తొమ్మిదో తరగతి చదువుతుంది.

సాయిదీప్తి (14) మల్కాజిగిరి జ్యోతి నగర్‌లోని జ్యోతి హైస్కూల్లో తొమ్మిదోతరగతి చదువుతోంది. కాగా సాయిదీప్తి స్కూలు ఫీజు రూ2వేలు చెల్లించాల్సి ఉంది. ఈనెల మొదటివారంలో చెల్లిస్తామని తండ్రి బుధవారమే స్కూల్‌కెళ్లి నిర్వాహకులకు చెప్పివచ్చాడు. అయితే గురువారం స్కూల్లో యూనిట్‌ టెస్టులు నడుస్తున్నాయి. దీంతో ఫీజు చెల్లించలేదని యాజమాన్యం ఆమెను ఇంటికి పంపించేసింది. దీంతో సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటికొచ్చి ప్యాన్‌కు ఉరేసు కుంది. ఈ విషయంపై స్కూలు నిర్వాహకురాలు లక్ష్మిని ఫోన్‌లో వివరణ కోరగా అందరిని అడిగినట్లే ఈ అమ్మాయిని ఫీజు అడిగాం అంతేకాని పరీక్ష రాయనీయమని చెప్పలేదు. తనకు కడుపునొప్పిగా ఉందని ఇంటింకెళ్లిందని చెప్పారు.

కొన్ని రోజులుగా వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. దీంతో దీప్తి ఫీజు చెల్లించలేకపోయారు. స్కూల్ యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ గురువారం జరిగిన పరీక్షలకు దీప్తిని అనుమతించలేదు. పాఠశాలకు వెళ్లిన వెంటనే.. తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే పేరంట్స్ ఉద్యోగాలకు వెళ్లారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అక్క సాయిలత ఇంట్లోనే ఉంది. స్కూల్ నుంచి వచ్చిన దీప్తిని ప్రశ్నించింది అక్క సాయిలత. ఫీజు కట్టకపోవటంతో పరీక్ష రాయనీయలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ తర్వాత.. బ్యాంక్ వెళ్లాలనే బయటకు వచ్చింది అక్క సాయిలత. తిరిగి వచ్చేసరికి దీప్తి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఉంది. ఆత్మహత్యకు ముందు ‘నన్ను ఎగ్జామ్‌ రాయనీయలేదు.. సారీ మామ్‌’ అని నోట్‌బుక్‌లో రాసింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top