తెలుగు హీరోల రెమ్యునరేషన్స్ ( పారితోషకాలు)

టాలీవుడ్ లో రెమ్యునరేషన్లను చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే. సినిమాకు అయిన ఖర్చులో సింహభాగం హీరోలకిచ్చే రెెమ్యునరేషనే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శరవేగంగా అభివృద్ది చెందుతున్న తెలుగు చిత్రపరిశ్రమ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో కూడా అలాగే ఉంది.  ప్రస్తుతం తెలుగు టాప్ స్టార్లలో రూ. 10 కోట్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఎవరూ తీసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదేమో. కొందరు హీరోలైతే ఇటు భారీ రెమ్యూనరేషన్ తో పాటు…..అదనంగా శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తం లేదా, లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంతో టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలు కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర బాషల్లో కూడా రిలీజ్ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్:

గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదీ సినిమాలతో పవన్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకున్న క్రేజ్ కూడా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పరంగా ఆయన వెయిట్ పెంచింది.
12745746_1755730947983564_8333394452620876591_n

జూ. NTR:

స్టూడెంట్ నెంబర్.1 సినిమాతో హిట్ల బాట పట్టిన తారక్ ఖాతాలో యమదొంగ, బృందావనం లాంటి భారీ బ్లాక్ బ్లాస్టర్లున్నాయ్. ఇక నాన్నకు ప్రేమతో సినిమా  NTR కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా ఉండింది.

12743854_1755731037983555_4268374274448860479_n

రవితేజ:

ఈ మద్య పెద్ద హిట్స్ ఏవీ లేనప్పటికి రవితేజ రెమ్యునరేషన్ మాత్రం 10 కోట్లకు పైమాటేనట.! ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ , విక్రమార్కుడు,మిరపకాయ్,కిక్  సిినిమాలతో వరుస హిట్లు కొట్టిన మాస్ మహరాజ రవితేజకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది.

12742618_1755731111316881_1621167279834267711_n

వెంకటేష్:

కొత్త హీరోలు వచ్చిన తర్వాత వెంకటేష్ తన లైన్ ను మార్చుకున్నారు. కథకు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరించడం తో పాటు కలెక్షన్స్ ను కురిపిస్తున్నారు. గోపాలా గోపాల, దృశ్యం సినిమాలు ఈ కోవలోనివే.

 

12705326_1755731144650211_4542234891654303172_n

ప్రభాస్:

ఒకే ఒక్క సినిమా ప్రభాస్ దశను దిశను పూర్తిగా మార్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో తెలుగు తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా బాహుబలి ఫేమస్ హీరో అయిపోయాడు.

12512462_1755730991316893_3297290530846062905_n

రామ్ చరణ్:

తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్న చరణ్ తేజ్… టాప్ హీరోలలో ఒకడు. మగధీర సినిమాతో తన మార్కెట్ ను పెంచుకున్న చరణ్ కు మళ్లీ ఈ మద్యకాలంలో అటువంటి బారీ హిట్ లేదనే చెప్పాలి. అయినప్పటికీ ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

 

12376794_1755730977983561_1149221828008275753_n

 

మహేష్:

కెరీర్ ఆరంభంలో  మురారీ, రాజకుమారుడు ల్లాంటి ఫీల్ గుడ్ మూవీస్ చేసిన మహేష్ తర్వాతి తర్వాత కాలంలో విబిన్న పాత్రల్లో మెప్పించారు. అతడు, పోకిరి, శ్రీమంతుడు ల్లాంటి భ్లాక్ బాస్టర్ మూవీస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

12246665_1755730961316896_3512175412203336329_n

అల్లు అర్జున్: 

గంగోత్రితో సైలెంట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి, దేశముదురు సినిమాతో దున్నేశారు. ఆర్య, రేసుగుర్రం సినిమాలతో టాలీవుడ్ పై తన ముద్ర వేశాడు.

10400721_1755731057983553_164509088039657825_n

Comments

comments

Share this post

scroll to top