ఈ 7 మంది టాలీవుడ్ స్టార్ల “ఫస్ట్ క్రష్” ఎవరో తెలుసా.? ప్రభాస్ అయితే స్కూల్ లో చదివేటప్పుడు.!

మన  హీరోలు హీరోయిన్లు ఎప్పుడూ సినిమాలు షూటింగ్లు అంటూ బిజిబిజిగా తిరుగుతారు..వారిలైఫే వేరు అనే ఆలోచనలో ఉంటాం కదా మనం..కానీ ఎప్పుడైనా ఆలోచించారా వారికి కూడా కొన్ని ప్రేమకథలుంటాయని..ప్రేమకథలా మనవాళ్లు ప్రేమిస్తే కాదనే వారెవరుంటారు అని అనుకోకండి..మనోళ్లని తిరస్కరించిన ప్రేమకథలూ ఉన్నాయి..వాళ్లెవరూ..తెలుసుకుందాం..

రెజీనా:

తమ ఇంటిపక్కన ఉండే కుర్రాడితో ప్రేమలో పడిందట రెజీనా..కానీ పాపం ఆ అబ్బాయి రెజీనా వైపు ఒకసారి కూడా కన్నెత్తి చూడలేదట..తర్వాత ఏముంది..తన పనిలో తాను బిజీ అయిపోయింది.

నితిన్:

పూజ ఆడియో లాంచ్ టైంలో శృతిహాసన్ పై తనకు చాలా ప్రేముందని నితిన్ బహిరంగంగా చెప్పాడు..కానీ శృతి ఆల్రెడీ మైకెల్ సొంతమైపోతుంది..బెటర్ లక్ నెక్స్ట్ టైం…

తమన్నా:

తన స్నేహితురాలి అన్నంటే తమన్నా పడి చచ్చిపోయేదట.కానీ ఏం చేస్తాం అప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాని అతను కనీసం పట్టించుకునేవాడు కాదట..పాపం ఇప్పుడు ఫీల్ అవుతాడేమో ఈ విషయం తెలిస్తే..

మహేశ్ బాబు:

టాలివుడ్ ప్రిన్స్,అమ్మాయిల కలల రాకుమారుడు నమ్రత సొంతం అయిపోతుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అమ్మాయిలు బాదపడ్డారు..అలాంటి మహేశ్ బాబుకి డెమి మూరే అంటే చాలా ఇష్టం అని..తన డైనమిక్ నేచర్ మహేశ్ కి నచ్చుతుందట.

అల్లు అర్జున్:

మన ప్రిన్స్ మహేశ్ పెళ్లిచేసుకుంటే ఎంతమంది అమ్మాయిల గుండెలు పగిలాయో కానీ..ఐశ్వర్యరాయ్ పెళ్లప్పుడు అల్లుఅర్జున్ కి గుండె పగిలినంత పనైందట..అంతలా ఇష్టపడ్డాడట ఐష్ ను..ఈ విషయం తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రభాస్:

చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదివేటప్పుడు క్లాస్ టీచర్ పై క్రష్ ఉండేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మన అమ్మాయిల కలల రాకుమారుడు బాహుబలి ప్రభాస్..

రానా:

తన స్కూల్ డేస్ లో ఒక సీనియర్ ని ప్రేమించినట్టు రానా గుర్తు చేసుకున్నాడు..అప్పటికి ఆమె రానాని కానీ,రాణా ప్రేమని కానీ గుర్తించలేదట..ఆ తర్వాత కొన్నాళ్లకి ఫేస్ బుక్ లో మ్యూట్యువల్ ఫ్రెండ్స్ లో ఆమె కనపడిందట..రానా కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఉందట..

Comments

comments

Share this post

scroll to top