డ‌గ్ర్స్ కేసులో…త‌మ పేర్లు రావ‌డంపై…హీరో న‌వ‌దీప్, నందు త‌నీష్ ల‌ రియాక్ష‌న్.!!

డ్ర‌గ్స్ కేసు మొత్తం టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. పలువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు కూడా ఈ కేసు విష‌యమై నోటీసులు అందాయి. అయితే ఈ కేసులో త‌మ పేర్లు ఉండ‌డంపై ప‌లువురు న‌టులు స్పందిస్తూ….త‌మ‌ను ఈ కేసులోకి లాగే ప్ర‌య‌త్నం చేయోద్దంటూ…వేడుకుంటున్నారు. ప‌లు టివీ ఛాన‌ల్స్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల ఆధారంగా న‌టుల రియాక్ష‌న్ ఈ విధంగా ఉంది.

నందు:

ఇప్ప‌టి వ‌ర‌కు నాకు ఎటువంటి నోటీసులు అంద‌లేదు. నేను ఏ ప‌రీక్షైనా సిద్దంగా ఉన్నాను. గ‌తంలో కూడా ఫేక్ రూమ‌ర్ ఇలాగే స‌ర్క్యులేట్ అయ్యింది. త‌ర్వాత త‌ప్పు అని తెలిసింది. నాకు చెడు స్నేహ‌లు లేవు. ఏడాది నుండి నేను ఒక్క ప‌బ్బుకు పోయిన దాఖ‌లాలు లేవు.

Reaction:

 

న‌వ‌దీప్:
నాకు నోటీసులు అందిన మాట వాస్త‌వ‌మే…అయితే మేము ఈవెంట్ చేస్తుంటాము. నెల రోజుల క్రితం ఓ రాంగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు న‌న్ను అప్రోచ్ అయ్యారు.వాళ్ళు ఏదేని ఇల్లీగ‌ల్ యాక్టివిటీస్ లో ఉన్నార‌ని తెలిసింది…వారి ద్వారా నా నెంబ‌ర్లు, నా మెసేజ్ లు బ‌య‌టికి వ‌చ్చుంటాయ్…బ‌ట్…ఇది పూర్తిగా అవాస్త‌ము.

 

త‌నీష్:
నాకు ఇంత‌వ‌ర‌కు నోటీసులు అంద‌లేదు. ఒక‌వేళ అందినా..నేను ఏ విచార‌ణ‌కైనా సిద్దం..కానీ నిజాలు తెలుసుకోకుండా మీరు ప‌దే ప‌దే నా పేరును ఛాన‌ల్స్ లో ప్ర‌చారం చేయ‌కండి.

 

 

సుబ్బ‌రాజు.
నాకు నోటీసులు వ‌చ్చాయి. 21 వ తేది విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఉంది.! నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడ‌ను…అలాంటిది ఇలాంటి వార్త ఎందుకొచ్చిందో ఏమో నాకు తెలియ‌దు.!

 

ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా.

సిగ‌రెట్ తాగ‌డం కూడా అల‌వాటు లేదు…అస‌లు డ్ర‌గ్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియ‌దు.! అలాంటి నా పేరు ఇలా టివిల్లో రావ‌డం లైఫ్ అండ్ డెత్ మ్యాట‌ర్ లాంటిది. చాలా బాధ‌గా ఉంది.

Comments

comments

Share this post

scroll to top