ఆస్ట్రేలియాలో తెలుగు యువతి దారుణ హత్య ప్రియుడి పైనే అనుమానం!!

ఆస్ట్రేలియాలో తెలుగు డెంటిస్ట్ డాక్టర్ దారుణ హత్యకు గురైంది. గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతీరెడ్డి… మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రీతీరెడ్డి… రాత్రి 11 గంటలకల్లా ఇంటికి వస్తానని చెప్పింది. అయితే రాత్రి ఎంతసేపటికీ ఆమె రాలేదు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు.. ఫోన్ కూడా కలవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు… విచారణ ప్రారంభించారు. చివరికి ప్రీతి శవాన్ని సూట్కేసులో గుర్తించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా కేసుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

ప్రీతి మృతదేహాన్ని సిడ్నీలోని సౌత్ వేల్స్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే ఓ సూట్‌కేసులో కుక్కి, వదిలివెళ్లారు దుండగులు. ఆమె మృతదేహాంపై ఉన్న గాయాలను బట్టి కత్తితో దాడి చేసి చంపినట్టు నిర్ధారించారు పోలీసులు. ప్రీతీరెడ్డి మృతదేహం దొరికిన తర్వాతి రోజే ఆమె మాజీ ప్రియుడు హర్షవర్థన్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె చివరి సారిగా కనిపించిన మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ సమీపంలో ప్రీతీరెడ్డితో పాటు హర్షవర్థన్ కూడా ఉన్నట్టు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఏమైంది… ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన తర్వాత రోజే హర్షవర్థన్‌కు ఎలా యాక్సిడెంట్ అయ్యిందనే విషయాలు మిస్టరీగా మారాయి.

సీడ్నిలోని మార్కెట్‌ స్ట్రీట్‌లో ఉన్న ఓ హోటల్‌లో ఆదివారం హర్షవర్థన్‌తో కలిసి ప్రీతీరెడ్డి బస చేసింది… ఆ తర్వాత సెయింట్ లియోనార్డ్స్‌లో కాన్ఫిరెన్స్‌కు అటెండ్ అయ్యింది.. చివరి సారిగా మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌లో కనిపించింది. ఈ దృశ్యాలన్ని సీసీటివిలో రికార్డ్ అయ్యాయి. ఆమె బాయ్‌ఫ్రెండ్ హర్షవర్థన్ నార్డేనే, ప్రీతీరెడ్డి చంపి, ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రీతీరెడ్డి మృతదేహాం పోలీసులకు దొరకడంతో హర్షవర్ధన్ దొరికిపోతాననే భయంతో అతివేగంతో కారును నడిపి, యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటాడని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే కానీ, అసలు నిజాలు తెలియవు.

Comments

comments

Share this post

scroll to top