ఈ 8 మంది స్టార్ హీరోయిన్ల హాబీస్ ఏంటో మీకు తెలుసా..? హీరోయిన్ అవ్వకపోయుంటే ఏమయ్యేవారంటే..!

మనలో చాలామందికి రకరకాల హాబీస్ ఉంటాయి..ఒకరికి టీవి చూడ్డం అలవాటుంటే మరికొందరికి పుస్తకాలు చదవడం అలవాటు ఉంటుంది..అఫ్కోర్స్ ఫేస్ బుక్ వచ్చాక పుస్తకాలు చదువుతున్న వారి సంఖ్య తగ్గిందనుకోండి అది వేరే విషయం..కానీ కొందరికి కరెన్సీ కలెక్ట్ చేయడం,స్టాంప్స్ కలెక్ట్ చేయడం ఇలా విభిన్న రకాల హాబీస్ ఉంటాయి.మరి సినిమా వాళ్లకు ఎలాంటి హాబీస్ ఉంటాయి అని ఎప్పుడైనా డౌటొచ్చింది..ఏముంది ఎప్పుడు చూసినా షూటింగ్స్ అంటూ తిరుగుతారు..వాళ్లకి ఇంక ఖాళీ టైం ఎక్కడ దొరుకుతుంది..షూటింగ్ అయిపోగానే ఇల్లు,ఫ్యామిలి లేదంటే రెస్ట్..అది కాదంటే బాడీ ఫిట్ గా మెయింటెయిన్ చేయడానికి ఎక్సర్సైజ్లు ఇవే వారి లైఫ్ అనుకుంటున్నారా..కానీ మన హీరోయిన్లకున్న హాబీస్ గురించే ఈ రోజు టాపిక్…

తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నాకి డ్యాన్స్ చేయడంఅంటే చాలా ఇష్టం.ఎన్టీఆర్,బన్నీలాంటి హీరోస్ తో పోటీ పడి డ్యాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది తమన్నానే.ఈ మధ్యే వచ్చిన జై లవకుశ  లోని స్పెషల్ సాంగ్లో తమన్నా డ్యాన్స్ అదరగొట్టేసింది.ఖాళీ దొరికితే డ్యాన్స్ చేయడమే కాదు ట్రావెల్ చేయడం కూడా తమన్నాకి ఇష్టం..కాశ్మీర్ ని ఎక్కువగా ఇష్టపడే తమన్నా న్యూమరాలజీని ఎక్కువ నమ్ముతుంది.

శ్రీయ సరన్

అప్పుడెప్పుడో ఇష్టం సినిమాతో పరిచయమైన శ్రీయ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. రజినీకాంత్,చిరంజీవి,బాలక్రిష్ణ,నాగార్జున లాంటి అందరు స్టార్ హీరోస్ తో నటించేసింది..ఇప్పటికీ నటిస్తూనే ఉంది. షూటింగ్ లేని టైంలో శ్రీయ హాబాస్ ఏంటంటే లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం లేదంటే మ్యూజిక్ వినడం.

సమంతా

మన తెలుగింటి కోడలు సమంతా అక్కినేని ఇప్పుడు స్టార్ హీరోయిన్..ఈ స్థాయికి రావడానికి ముందు సమంతా పాకెట్ మనీ కోసం చిన్న చిన్న పనులు చేసేది అని కూడా తెలుసు..ఇప్పడుు ఈ స్థాయికి వచ్చాక కూడా తను తన స్నేహితులను మర్చిపోలేదు..కొంచెం ఖాళీ దొరగ్గానే ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేయడం,వారితో లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం చేస్తుంటుంది.

శృతిహాసన్

తన బిజీ షెడ్యూల్ నుండి కొంచెం లీజర్ దొరగ్గానే పుస్తకాలు చదువుతుంది శృతిహాసన్..దాంతో పాటు సెల్ఫీలు దిగడం శృతి అలవాటు.దాంతో పాటు ఫ్రెండ్స్ తో ఛాట్ చేయడంతో పాటు లాంగ్ డ్రైవ్ కి వెళ్లడానికి ఇష్టపడుతుంది.

ఐశ్వర్యరాయ్

మన ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ ఒకప్పడు హాబీస్ ఏంటంటే చెప్పడం కష్టమేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా చెప్పేయొచ్చు..ఇంకేముంటుంది ఖాళీ దొరగ్గానే కూతురు ఆరాధ్యతో ఉండడానికి,ఫ్యామిలి ని చూసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది ఐష్.

ఆసిన్

ఓయ్ చెన్నై అనగానే అమాయకంగా చూసే ఆసిన్ ,ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ క్యారెక్టర్ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది.తమిళ్,తెలుగు,మళయాలిలలో తన సత్తా చాటుకుని,బాలివుడ్లో కూడానటించింది..ఈ చెన్నై ముద్దుగుమ్మ..తరచూ పార్టీల్లో కనపడే ఆసిన్, లాంగ్ డ్రైవ్ కి ఒక్కతే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడం,మ్యూజిక్ వినడం అలవాటు.

హన్సిక

ఇది మట్టండీ మట్టీ అంటూ అమాయకంగా మాట్లాడిన పాల బుగ్గల హన్సిక .. షూటింగ్స్ అయిపోగానే డ్యాన్స్ చేయడం హన్సిక అలవాటు .లేదంటే మ్యూజిక్ వినడం,అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తినడం హన్సిక అలవాట్లు..

త్రిష

త్రిష కృష్ణన్ ఖాళీ సమయాల్లో పుస్తక పఠనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది.అంతే కాదు ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడే త్రిష..పార్టీలకు దూరంగా ఉంటుంది..మ్యూజిక్ వినడం కూడా త్రిష అభిరుచుల్లో ఒకటి.

 

Comments

comments

Share this post

scroll to top