చనిపోయిన మహిళ గర్భసంచి ఇంకో మహిళ కు..!! ప్రాణం లేకున్నా, మరొకరికి ప్రాణం పోసింది.!!

గర్భసంచి మార్పు అనేది మనం ఇది వరకు విన్నాం, ఇటీవలే మన భారతదేశం లో తల్లి గర్భసంచిని కూతురికి అమర్చారు, అమ్మాయి గర్భం దాల్చి చిన్నారికి జన్మనిచ్చింది, వారిరువు ఇప్పుడు ఆరోగ్యం గా క్షేమంగా ఉన్నారు. కానీ చనిపోయిన వారి గర్భసంచిని వేరొకరికి అమర్చడం ఎప్పుడు విని ఉండరు.

బ్రెజిల్ లో జన్యు లోపం కారణంగా ఓ మహిళకు పుట్టుకుతోనే గర్భసంచి లేదు, 4500మందిలో ఒకరికి అరుదుగా వచ్చే మేయర్ రాకిటాన్స్ కీ కస్టర్ హాసర్ అనే సిండ్రోమ్ కారణంగా ఆమె తల్లి అయ్యే అవకాశం లేకుండా పోయింది. అయితే, పెళ్లి తరువాత ఆ మహిళ వైద్యులను సంప్రదించగా, గర్భాశయ మార్పిడి ద్వారా సాధ్యమౌతుందని చెప్పారు. దీనికి ఆమె అంగీకరించింది.

2016 లో చనిపోయిన మహిళ గర్భసంచిని ఈమె కు అమర్చారు డాక్టర్స్, ఆపరేషన్ సక్సెస్ కావడం తో ఆమెకు రుతుస్రావం మొదలైంది. ఈ క్రమంలో 2017లో గర్భం దాల్చిన ఆమె అదే ఏడాది డిసెంబరు 15న ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఆమెకు సిజేరియన్‌ చేసారు( మాములు డెలివరీ సాధ్య పడక పోవడం తో). పాప పుట్టిన సమయంలో రెండున్నర కిలోల బరువు ఉంది. ప్రస్తుతం పాప చాలా ఆరోగ్యంగా ఉంది.

పరపంచం లో గర్భ సంచి మార్పిడి చాలా జరుగాయి, కానీ వాటిలో విజయవంతం అయినవి చాలా తక్కువ, కానీ చనిపోయిన మహిళ గర్భ సంచి మార్పిడి ద్వారా శిశువు జన్మించడం తో బ్రెజిల్ వైద్యులను అందరూ కొనియాడుతున్నారు. గర్భ సంచి ఇబ్బందుల వల్ల పిల్లలు లేక బాధ పడుతున్న మహిళలకు ఇలా గర్భ సంచి మార్పు ద్వారా పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top