పండ్ల రంగు మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా.? ఈ సులువైన పద్దతులను ప్రయత్నించండి..!!

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరు అంటారు, ముఖ్యంగా రోజుకి కనీసం ఒక యాపిల్ పండు అయినా తినాలని డాక్టర్లు కూడా చెబుతారు, యాపిల్ పండును కోసిన కొద్ది సేపటికే రంగు మారుతుంది, యాపిల్ అనే కాదు చాలా పండ్లు కోసిన కొద్దిసేపటి తరువాత రంగు మారుతాయి, ఇలా మారకుండా ఉండాలంటే కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే చాలు.

  • టేబుల్ స్పూన్ తేనెను తీసుకుని గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి అందులో 30 సెకన్ల పాటు పండ్ల ముక్కలను ఉంచినట్లేతే రంగు మారవు. ఇలా చేయడం ద్వారా సుమారు 8 గంటల పాటు ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
  • ఫుడ్ స్టోర్స్‌లో దొరికే జింజర్ అలే (అల్లం ద్రావణం)రెండు చుక్కలు నీటిలో వేసి కొద్ది సేపు ఉంచినా తాజాగా కనిపిస్తాయి. అల్లంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలిపివేస్తుంది.
  • ఒక గిన్నె తీసుకుని అందులో అర టీస్పూన్ ఉప్పు వేయాలి. కట్ చేసిన పండ్ల ముక్కలని అందులో రెండు నిమిషాలు ఉంచి తీస్తే కలర్ మారకుండా తాజాగా కనిపిస్తాయి.
  • ఫుడ్ స్టోర్స్‌లో దొరికే ఆస్కార్బిక్ ఆమ్లంలో విటమిన్ సి ఉంటుంది. ఈ ద్రావణాన్ని రెండు చుక్కలు నీటిలో వేసి పండ్లముక్కలను రెండు నిమిషాలు ఉంచినట్లైతే రంగు మారకుండా ఉంటాయి.
  • టేబుల్ స్పూన్ నిమ్మరసం నీటిలో వేసి అందులో పండ్ల ముక్కలు కొద్ది సేపు ఉంచి తీసినట్లైతే రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.

ఈ సులువైన పద్ధతులు పాటించడం ద్వారా పండ్ల రంగు మారకుండా ఉంటుంది, కేవలం కొంత సమయం వరకే ఈ ప్రక్రియల వల్ల రంగు మారకుండా నిలుపగలం, పండ్లు కూడా కొన్ని రోజులే ఉంటాయి కనుక, తినాలనిపించినప్పుడు మోతాదులో తెచ్చుకొని ఈ ప్రక్రియ లలో ఒకటి వాడి పండ్లు తిని ఆరోగ్యంగా ఉండండి.

 

Comments

comments

Share this post

scroll to top