టైట్ జీన్స్ ధరిస్తున్నారా… మీ ఆరోగ్యం మీరే పణంగా పెడ్తున్నారు…

మారుతున్న కాలానికి అనుగుణంగా యువతీయువకులు అభిరుచి కూడా మారుతుంది..వారి ఇష్టాలకు తగినట్టుగానే  రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అమ్మాయిలకైతే బోలెడన్నీ మోడ్రన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్కిన్ టైట్ జీన్స్, స్కిన్ టైట్ లెగ్గింగ్స్, స్కిన్ టైట్ షాట్స్ ఇలా చాలా రకాలున్నాయి..కానీ  ఇలాంటి టైట్ దుస్తులను ధరించడం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు…

చాలామంది లావుగా ఉన్నవాళ్లు వారి పిరుదులు,తొడల భాగంలో ఉన్న అనవసర ఫ్యాట్ ని కనిపించకుండా చేయడం కోసం ఇలాంటి టైట్ జీన్స్ వేసుకుంటారు.కానీ దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది..ఫ్యాషన్ ప్రపంచంలో మిమ్మల్ని అందంగా చూపినప్పటికీ మన కండరాల ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి.స్కిన్‌ టైట్‌ జీన్స్‌ వల్ల కాళ్లకు రక్తసరఫరా నిలిచిపోయి..తద్వారా కండరాలు, నరాలు చచ్చుబడిపోతాయి.కండరాలకు రక్తసరఫరా సరిగా లేకపోతే దీర్ఘకాలంలో, క్రియేటిన్ కైనేజ్ ఎంజైము అసాధారణ గరిష్ట స్థాయిల వల్ల మూత్రపిండాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది.

మనం వేసుకునే దుస్తులు మన బాడీ షేప్ ను మౌల్డ్ చేస్తాయి..టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల కొవ్వును అనిచి పెట్టి ఉంచినప్పుడు మన శరీరాకృతి బాగున్నప్పటికీ ,తర్వాతర్వాత నొక్కి పెట్టి ఉంచబడిన అనవసర ఫ్యాట్ మన శరీరానికి ఒక ఆకృతి లేకుండా చేస్తాయి. 

కేవలం అమ్మాయిలకే కాదు టైట్ జీన్స్ వల్ల అబ్బాయిలకు కూడా పెద్ద నష్టం వాటిల్లుతుంది. వృషణాలు దెబ్బతిని వ్యందత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.రక్త సరఫరా సరిగా లేక కండరాల్ని దెబ్బతీసే దీన్ని కంపార్ట్ మెంటల్ సిండ్రోమ్ గా డాక్టర్లు పేర్కోన్నారు.

35 ఏళ్ల మహిళ ఒకరు స్కిన్ టైట్ జీన్స్ ధరించి తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ చాలా సేపు నేలపై కూర్చుంది. ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా కాళ్లలో నిస్సత్తువ ఆవహించింది. దీంతో ఆమె అడుగు తీసి అడుగు వేయలేక, కాళ్ళపై నిలబడలేక అక్కడే కుప్పకూలిపోయింది. మళ్లీ పైకి లేచి నిలబడలేని దుస్థితి ఏర్పడింది. కాళ్ళకు రక్తం సరఫరా నిలిచిపోవడం వల్లే ఇలా జరిగినట్టు నిర్ధారించారు డాక్టర్లు .కాళ్లు విపరీతంగా వాచిపోయి.. ప్యాంటును తీసే పరిస్థితి కూడా  లేక ప్యాంటును నర్సులు కత్తిరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మన శరీరం మనకు దొరికిన బహుమతి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా స్వీకరించాలి..అలాకాకుండా మార్పు కోరుకుంటే దానివల్ల మిగిలేది బాద తప్ప ఏం లేదు..కాబట్టి మన శరీరాన్ని ప్రేమిద్దాం…ఎదుటివాళ్లకు         అందంగా కనపడడం కోసం మన శరీరాన్ని కష్టపెట్టకుండా చూస్కుందాం…

Comments

comments

Share this post

scroll to top