మరో J.D, అవినీతి అధికారుల సింహస్వప్నం.ఉండాలండీ మీలాంటి వారు.

అవినీతి పై ఉక్కుపాదం అనగానే మనందరికీ J.D లక్ష్మీనారాయణ గుర్తుకువస్తారు. ప్రజలను లంచాల పేరుతో వేధిస్తున్న  అవినీతి అధికారులకు చుచ్చు పోయించారు లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు ఆ  J.D ని తలపిస్తున్నారు నెల్లూరు ACB  DSP తోట ప్రభాకర్.  జిల్లాలో ఎక్కడ  అవినీతి జరిగిన తన టీమ్ తో  ప్రత్యక్షమై…. ఆధారలతో సహా పట్టుకుంటున్నారు.  పోలీస్ శాఖ, రిజిస్ట్రేషన్ ఆఫీస్,  చెక్ పోస్ట్ , కార్పోరేషన్…ఇలా ఏ సంస్థలో అవినీతి జరిగినా ప్రత్యక్షమై అవినీతి అధికారులను హడలెత్తిస్తున్నారు తోట ప్రభాకర్.

ప్రజలు టాక్స్ లు కడితేనే మనకు జీతాలొస్తున్నాయంటూ చెక్ పోస్ట్ దగ్గర అడ్డంగా దోచుకునే అధికారులను హడలెత్తించారు. మనం ప్రజల దగ్గర అడుక్కొని బతుకుతున్నాం అంటూ అవినీతి  పోలీస్ అధికారికి బుద్దిచెప్పారు. ఇలా వరుస దాడులతో…కరెప్షన్ రాజాను ఖంగుతినిపిస్తున్నారు తోట ప్రభాకర్ గారు.

ఉండాలి. సార్ మీలాంటి వారు అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడి జనాలు.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top